TSNGC Studemts online Competition || విద్యార్థులకు 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా' ఆన్లైన్లో పోటీలు
విద్యార్థులకు 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా' ఆన్లైన్లో పోటీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ గ్రీన్‌కోర్ ఆధ్వర్యంలో రాష్ట్రం లోని 33 జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విధ్యార్థులు, ఐదు నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులు జూనియర్ విభాగాల్లో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు సీనియర్ విభాగాల్లో నేరుగా నమోదు చేసుకొని, ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు.
‘మన భూమి పునరుద్ధరణ’ అనే అంశంపై పోస్టర్ మేకింగ్,
‘వంట వనం’ (కిచెన్ గార్డెన్) అంశంపై ఫొటోగ్రఫీ, క్విజ్ పోటీలు ఉంటాయన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విధ్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
మీ ఎంట్రీని అప్లోడ్ చేయండి మరియు మీ రిజిస్టర్డ్ మెయిల్‌కు సర్టిఫికేట్ పంపబడుతుంది.
మీరు ఫైల్‌లను అప్లోడ్ చేసి, ఈ ఫారమ్‌ను సమర్పించినప్పుడు మీ Google ఖాతాతో అనుబంధించబడిన పేరు మరియు ఫోటో రికార్డ్ చేయబడతాయి.
విద్యార్థులు తమ ఎంట్రీలను అప్లోడ్ చేయడానికి పక్క లింక్ పై క్లిక్ చేయండి: http://bit.ly/ngcwed2021
గమనిక: సర్టిఫికేట్ పొందడానికి 50% క్వాలిఫైయింగ్ మార్కులు అవసరం.
క్విజ్ ఉత్తీర్ణత సాధించిన తరువాత సర్టిఫికేట్ మీ మెయిల్ ఐడికి పంపబడుతుంది.
అలాగే క్విజ్ లో పాల్గొనడానికి పక్క లింక్ పై క్లిక్ చేయండి: http://bit.ly/ngcwedquiz
పూర్తి వివరాలకు ఎన్జీసీ జిల్లా సమన్వయకర్త వి.గురునాథరావు చరవాణి నెంబర్ 9866549297లో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు.
Comments
Post a Comment