AP TW GURUKULAM Admission Notification 2021 || ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి (గురుకులం) నుండి ప్రవేశ ప్రకటన విడుదల.. పూర్తి వివరాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2021-22 విద్యా సంవత్సరమునకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో లాటరీ పద్ధతిలో 6వ తరగతి లో ప్రవేశం కొరకు మరియు 7వ తరగతి, 8వ తరగతులలో మిగిలియున్న సీట్ల భర్తీ కొరకు, అర్హులైన బాలబాలికల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
7వ తరగతి, 8వ తరగతి లో మిగిలి ఉన్న సీట్ల వివరాలు మరియు రిజర్వేషన్ల నియమాలు అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరచబడినవి, ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ను చదవండి.
అర్హత ప్రమాణాలు: 2020-21 విద్యాసంవత్సరంలో 5వ తరగతి మరియు 6వ తరగతి, 7వ తరగతి ఇంగ్లీష్/ తెలుగు మీడియంలో చదివిన గిరిజన బాలబాలికలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆశ్రమ, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.
ఆదాయం: తల్లిదండ్రులు వార్షిక ఆదాయం 1లక్ష రూపాయలకు మించకూడదు.
ప్రవేశం పొందే సమయంలో విద్యార్థులు సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలు:
1. కుల ధ్రువీకరణ పత్రము,
2. ఆదాయ ధ్రువీకరణ పత్రము,
3. రేషన్ కార్డు,
4. ఆధార్ కార్డు,
5. మార్కుల మెమో,
6. స్టడీ సర్టిఫికేట్,
7. రికార్డ్ షీట్,
8. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,
9. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్,
10. 6 పాస్ పోర్ట్ సైజు ఫోటోలను సమర్పించాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.05.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2021.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:
1. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://aptwgurukulam.ap.gov.in/
3. న్యూ అండ్ ఈవెంట్స్ విభాగంలో కనిపిస్తున్న టువంటి EMRS Admission Application 2021-22 లింక్ పై క్లిక్ చేయండి.
4. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్, కరికులర్, అప్లికేషన్ ఫామ్ లింక్స్ కనిపిస్తాయి.
5. దరఖాస్తులు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ లింక్ పై క్లిక్ చేయండి.
6. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
7. ఇందులో అభ్యర్థి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి దరఖాస్తులు చేసుకోవాలి.
8. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వవలెను, దరఖాస్తులకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణలు, అడ్మిషన్ కు సంబంధించిన వివరాలు ఈ మొబైల్ నెంబర్ కు అందించబడతాయి.
9. దరఖాస్తులు నమోదు చేసిన తర్వాత వివరాలు మార్చడానికి అవకాశం లేదు.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://aptwgurukulam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్: http://apgpcet.apcfss.in/TWREISEMRS/
Comments
Post a Comment