TSWRAFPDCW Admission test for girls 2021 || తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి... యాదాద్రి భువనగరి జిల్లా నుండి, (2021-2022) విద్యాసంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ఇక్కడ ప్రవేశం పొందిన మహిళలకు ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు, మిలిటరీ సంబంధిత అంశాలను ప్రధానంగా బోధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్మిషన్ వివరాలు:
ఇన్స్టిట్యూట్ పేరు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ (TSWRAFPDCW), భువనగిరి, బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా.
కోర్సులు:
1. బీఎస్సి(ఎంపీసీ),
2. బీఎ(హెచ్ఈపీ).
సీట్ల వివరాలు: ఒక్కో కోర్సులో 120 సీట్లు ఉన్నాయి. పతి కోర్సులో సెక్షన్ కు 40 సీట్ల చొప్పున 3 సెక్షన్లు ఉంటాయి.
మొత్తం సీట్లు: 220.
ఈ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ క్రింది స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
1. ఇంటర్మీడియట్లో చదివిన అకాడమిక్ సబ్జెక్ట్ ల ఆధారంగా రాత పరీక్ష.
2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్.
3. సైకో అనలిటికల్ టెస్ట్.
4. మెడికల్ టెస్ట్.
5. ఇంటర్వ్యూ.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్మీడియట్లో తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదివిన అభ్యర్థులుప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు.
ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి
ఎత్తు: కనీసం 152 సేం.మీ ఉండాలి.
ఆదాయం: కుటుంబ వార్షిక ఆదాయం నగరాల్లో నివసిస్తున్న వారికి రూ. 2,00,000/- పట్టణాల్లో నివసిస్తున్న వారికి రూ. 1,50,000/- లోపు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు ప్రవేశం పొందే సమయంలో ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీలను సమర్పించాలి.
1. కుల దృవీకరణ పత్రము.
2. ఆదాయ ధ్రువీకరణ పత్రము.
3. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్.
4. బోనఫైడ్ సర్టిఫికేట్.
5. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ కనీసం 60% & అంతకంటే ఎక్కువ మార్కులు కలుగినది.
6. ఆధార్ కార్డ్.
7. పాస్ ఫోటోలు 5.
8. ఆరోగ్య శ్రీ/ రేషన్ కార్డ్.
వర్గాల వారీగా సీట్ల కేటాయింపు:
1. ఎస్సి లకు 75%
2. ఎస్టీ లకు 6%
3. బీసీ లకు 12%
4. బీసీ-సీ లకు 2%
5. మైనారిటీ లకు 3%
6. ఓసీ/ ఈబీసీ లకు 2%
మొత్తం 100%.
స్క్రీనింగ్ టెస్ట్ మరియు దాని పెరామీటర్ వివరాలు:
1. ఎంట్రన్స్ టెస్ట్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. కొన్నింటికి ఖాళీలు పూరించాలి. మరికొన్నింటిని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి. ఒక్కొ ప్రశ్నకు కు 1 మార్క్ చొప్పున మొత్తం 100 మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది.
2. ఫిజికల్ టెస్ట్: ఇందులో వంద మీటర్ల స్ప్రింట్.
400 మీటర్ల పరుగు. సీటప్స్, షటిల్ రేస్, అబ్స్టాకిల్ టెస్ట్ ఉంటాయి.
3. సైకో అనలిటిక టెస్టులు: ఇందులో థీమాటిక్ ఆఫ్రిసియేషన్ టెస్ట్(టీఏటీ) ఒక బొమ్మ. వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ) పది పదాలు. సిచ్చుయేషన్స్ రియాక్షన్ టెస్ట్(ఎస్ ఆర్ టి) ఐదు ఎస్ ఆర్ టీ లు ఉంటాయి.
4. మెడికల్ టెస్ట్: ఇందులో నియామకాలకు అనుగుణంగా ఎత్తు, బరువు చెక్ చేస్తారు. కళ్ళు, చెవులు, పళ్ళు, ఫ్లాట్ ఫూట్, నాక్ నిస్, వర్ణాందత్వం, సంభాదిత పరీక్షలు నిర్వహిస్తారు.
క్రానింగ్ డీసీజెస్ ఏమైనా ఉన్నాయా. సర్జరీలు జరిగాయన్న అంశాలు చెక్ చెక్టారు.
ఒక అంశం ఇచ్చి చిన్న లెక్చర్ ఇవ్వమని అడుగుతారు. చివరిగా పెర్సనాల్ ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు.
ఫలితాల వెయిటేజి:
1. పదో తరగతి మార్కులకు. 5%
2. ఇంటర్మీడియట్ మార్కులకు. 5%
3. రాత పరీక్ష కు. 5%
4. ఫిజికల్ టెస్టు కు. 15%
5. అబ్స్టాకిల్ టెస్ట్ కు. 5%
6. సైకాలజికల్ టేస్ట్ కు. 20%
7. లెక్చర్ టెస్ట్ కు. 15%
8. పెర్సనల్ ఇంటర్వ్యూ కు. 30%
మొత్తం 100%
దరఖాస్తు ఫీజు: రూ. 100/-
దరఖాస్తుల కు చివరి తేదీ: 31.05.2021.
దరఖాస్తుల కు చివరి తేదీను: 20.06.2021 వరకు పొడిగించారు..
అధికారిక వెబ్సైట్: https://tswreis.in/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment