Bank Note Press (BNP) JOBs 2021 || బ్యాంక్ నోట్ ప్రెస్,దేవాస్ లో 135 ఉద్యోగాలు. పూర్తి వివరాలివే....
బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ మధ్యప్రదేశ్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన బ్యాంక్ నోట్ ప్రైస్.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం 135 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 135 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం వీడియొ చూడండి👇.
1. వెల్ఫేర్ ఆఫీసర్ - 1,
వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ/ డిప్లామా (సోషల్ ఫైన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.29,740/- నుండి 1,03,000/- వరకు చెల్లిస్తారు.
2. సూపర్వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ) - 1,
3. సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 1
సూపర్వైజర్ (కింగ్ ఫ్యాక్టరీ), సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాలకు విద్యార్హత: డిప్లామా (డైస్టఫ్ టెక్నాలజీ/ పెయింట్ టెక్నాలజీ)/ సర్ఫేస్ కోచింగ్ టెక్నాలజీ/ ఇంకా టెక్నాలజీ/ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డిప్లామా (ఐటి/ కంప్యూటర్) ఉత్తీర్ణత అవ్వాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.27,600/- నుండి 95,910/- వరకు చెల్లిస్తారు.
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 15.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యువేట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తో ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.21,540/- నుండి 77,160/- వరకు చెల్లిస్తారు.
5. జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ) - 60,
6. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) - 23,
7. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఐటి) - 15,
8. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఏసీ) - 15.
జూనియర్ టెక్నీషియన్ (ఇంకా ఫ్యాక్టరీ/ ప్రింటింగ్/ ఎలక్ట్రికల్/ ఐటీ/ మెకానికల్/ ఏపీ) ఉద్యోగాలకు విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటిఐ తో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ అర్హత సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.
వయసు: 25 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.18,780/- నుండి 67,390/- వరకు చెల్లిస్తారు.
9. సెక్రటేరియల్ అసిస్టెంట్ - 1,
10. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 3.
సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తో నిమిషానికి ఇంగ్లీష్ 80 పదాలు, నిమిషానికి హిందీలో 40 పదాలను కంప్యూటర్ పై టైప్ చేయగలగాలి.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.23,910/- నుండి 77,160/- వరకు చెల్లిస్తారు.
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ విధ్యార్హత రాత పరీక్ష ఆదారంగా నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్:👇
అధికారిక వెబ్సైట్: https://bnpdewas.spmcil.com/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.06.2021.
Comments
Post a Comment