Militry Engineer Services Recruitment 2021 || మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) నుండి 572 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే.
ఎంఈఎస్ (మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్) లో సూపర్వైజర్, డ్రాఫ్ట్ మెన్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
పూణేలోని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ మొత్తం 572 ఉద్యోగాలను ప్రకటించింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 572 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సూపర్వైజర్ బీ/ ఎస్ లో - 458,
2. డ్రాఫ్ట్ మెన్ లో - 114.
మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాలకు విద్యార్హత:
1. సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ(ఎకనామిక్స్/ కామర్స్/ స్టాటిస్టిక్స్/ బిజినెస్ స్టడీస్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణత తోపాటు స్టోర్స్, అకౌంట్ నిర్వహణలో 1 సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
లేదా పై విభాగాల్లో డిగ్రీతోపాటు డిప్లామా (మెటీరియల్ మేనేజ్మెంట్/ వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేసింగ్/ లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రోక్యూర్ మెంట్) పూర్తి చేసి స్టోర్స్, అకౌంట్స్ సంబంధిత రంగాల్లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
2. డ్రాఫ్ట్ మన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లామా (ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్) పూర్తి చేసి ఉండాలి. ఆటో క్యాడ్, జిరాక్స్ ఆపరేషన్ ప్రింటింగ్ అండ్ లామినేషన్ లకు సంబంధించి 1 సంవత్సరం పాటు పనిచేసిన అనుభవం అవసరం.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రాత పరీక్ష వివరాలు:
➥ ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
➥ మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
➥ మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
➥ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,
➥ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్,
➥ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఉద్యోగ సంబంధిత సబ్జెక్టుల నుంచి ఒక్కొక్క దానిలో 25 ప్రశ్నలు అడుగుతారు.
➥ సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 2 మార్కులు,
➥ మిగిలిన ప్రశ్నలకు ఒక్కోదానికి 1 మార్కు చొప్పున కేటాయిస్తారు.
➥ మొత్తం మార్కులు 125.
➥ ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి.
➥ తప్పుగా గుర్తించిన సమాధానాలకు 1/4(పావు) మార్కు కోత విధిస్తారు.
పరీక్షా సమయం: 2 గంటలు.
➥ రాత పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, అభ్యర్థులకు 50 శాతం.
➥ ఓబిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40శాతం మార్పులు తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
➥ రాత పరీక్షలో అర్హత పొందిన వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
➥ దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
➥ రాత పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల వారికి సికింద్రాబాద్, వైజాగ్.
➥ దరఖాస్తు ఫీజు: రూ.100/-
➥ రాత పరీక్ష నిర్వహించే తేదీలు: 20.06.2021.
➥ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.05.2021.
➥ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mes.gov.in/
➥ ఆన్లైన్ దరఖాస్తులకి డైరెక్ట్ లింక్: https://www.mesgovonline.com/
దరఖాస్తు చేసునే విధానం:
➥ అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment