SVVU Teaching Staff Recruitment 2021 || ఎస్‌వివియూ నుండి వివిధ విభాగాల్లో బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వివియూ) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు మొత్తం 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 117.
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ లో - 47,
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
1. వెటర్నరీ సైన్స్ లో - 40,
2. డెయిరీ సైన్స్ లో - 2,
3. ఫిషరీ సైన్స్ లో - 4,
4. అగ్రికల్చర్ సైన్సెస్ లో - 1.
విద్యార్హత: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు కనీసం 60 శాతం మార్కులతో పోస్ట్గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
నెట్/ స్లెట్/ సెట్ అర్హత పొంది ఉండాలి. లేదా పి హెచ్ డి పూర్తి చేసి ఉండాలి.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
1. వెటర్నరీ సైన్స్ లో - 64.
2. డెయిరీ సైన్స్ లో - 2,
3. ఫిషరీ సైన్స్ లో - 4.
విద్యార్హత: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ లేదా పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రీసెర్చ్ పేపర్లు, పేటెంట్ రైలింగ్, అప్రూవల్ లెటర్, పబ్లికేషన్ లు, ప్రాజెక్ట్ లెటర్లు, పీహెచ్డీ అవార్డు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వెయిటేజీ:
1. అకడమిక్ విద్యార్హతలకు 20 మార్కులు,
2. అకడమిక్/ రీసెర్చ్/ అనుభవానికి 15 మార్కులు,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ లో సైంటిఫిక్ పబ్లికేషన్స్ లకు 15 మార్కులు,
4. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ లో స్పెషల్ అవార్డు/ మెడల్స్/ ఫెలోషిప్స్/ గుర్తించదగిన అకడమిక్ ఎక్స్లెన్స్ కు 05 మార్కులు,
5. రీసెట్ ప్రాజెక్టు లకు 10 మార్కులు,
6. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ లో ప్రొఫెషనల్ రంగంలో సాధించిన విజయాలకు 05 మార్కులు
7. విశ్వవిద్యాలయాల్లో ఇతర అసైన్మెంట్ లకు 10 మార్కులు,
8. ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభకు 20 మార్కులు.
పై విధంగా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: 22.05.2021.
చిరునామా: ద రిజిస్టార్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డాక్టర్ వైఎస్ఆర్ భవన్, తిరుపతి - 517502.
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment