SBI Junior Associates Recruitment 2021 || కస్టమర్ సపోర్ట్ & సెల్ విభాగంలో '5000' జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్ 2021.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్ లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్) ఉద్యోగాల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ.. మొత్తం '5000' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
● ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ఆ రాష్ట్రంలోని ప్రజాధారణ లో ఉన్న స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం లో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.
● తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు/ హిందీ భాషలలో ప్రావీణ్యం ఉండాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా పైన పేర్కొన్న స్థానిక భాష యొక్క నాలెడ్జ్ కోసం పరీక్ష నిర్వహించబడుతుంది.
● ఈ పరీక్షలు ఆన్లైన్ ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన తర్వాత కానీ, బ్యాంక్లో చేరే ముందు నిర్వహించబడతాయి అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
● ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి నియామకం ఇవ్వబడదు.
● 10వ లేదా 12వ తరగతి చదివిన ప్రామాణిక మార్క్ షీట్/ సర్టిఫికెట్లు కలిగి అభ్యర్థులు స్థానిక భాష అధ్యయనం చేసినట్లు రుజువు చేసిన వారికి భాషా పరీక్ష అవసరం లేదు..
👉 తప్పక చదవండి: 18 సంవత్సరాలు పై బదినవారు CoWIN Vaccine కోసం "కోవిన్" వెబ్ పోర్టల్ లో లేదా "ఆరోగ్య సేతు" యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండిలా... స్లాట్ బుక్ చేసుకోండీ.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్).
ఖాళీల సంఖ్య: 5000 పోస్టులు ప్రకటించారు.
SBI సర్కిల్ వారిగా ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. తెలంగాణ (హైదరాబాద్) లో - 275 పోస్టులు,
2. అహ్మదాబాద్ లో - 902 పోస్టులు,
3. బెంగళూర్ లో - 400 పోస్టులు,
4. గోపాల్ లో - 198 పోస్టులు,
5. భోపాల్ లో - 302 పోస్టులు,
6. భువనేశ్వర్ లో - 75 పోస్టులు,
7. చెన్నై లో - 554 పోస్టులు,
8. ఢిల్లీ లో - 159 పోస్టులు,
9. హర్యానా లో - 110 పోస్టులు,
10. జైపూర్ లో - 157 పోస్టులు,
11. కేరళ లో - 100 పోస్టులు,
12. లక్నో లో - 350 పోస్టులు,
13. మహారాష్ట్ర లో - 650 పోస్టులు,
14. నార్త్ ఈస్టర్న్ లో - 220 పోస్టులు,
"పూర్తి సమాచారం కోసం అదికారిక ప్రకటన చదవండి"
ఇలా మొత్తం 5000 పోస్టుల భర్తీకి నియామకాలను ఈ నోటిఫికేషన్ ద్వారా చేపడుతున్నారు.
వయసు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సెల్). దరఖాస్తు చేసుకుని అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
1. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
2. ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
3. PWD ( Gen/ EWS) లకు 10 సంవత్సరాలు,
4. PWD (SC/ ST) లకు 15 సంవత్సరాలు,
5. PWD (OBC) లకు 13 సంవత్సరాలు,
6. మాజీ సైనికులు/ వికలాంగ మాజీ సైనికులు రక్షణ సేవలు అందించిన వాస్తవ సేవాకాలం + 3 సంవత్సరాలు, (ఎస్సీ/ ఎస్టీ కి చెందిన వికలాంగ మాజీ సైనికులకు 8 సంవత్సరాలు) గరిష్టంగా 50 సంవత్సరాల కు లోబడి ఉంటుంది.
7. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు మహిళలు తమ ప్రాంతాల నుండి న్యాయంగా విడిపోయినవారు. 7 సంవత్సరాలు (Gen/ EWS కోసం గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు, OBC లకు 38 సంవత్సరాలు మరియు ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు).
పరీక్ష విధానం: ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామ్) మరియు దరఖాస్తులో పేర్కొన్న స్థానిక భాష యొక్క పరీక్ష ఉంటుంది.
■ ప్రాథమిక పరీక్ష:
◆ ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
◆ ప్రశ్నలను ఆబ్జెక్టివ్ టైప్ లో అడుగుతారు.
◆ పరీక్షా సమయం: 1 - గంట.
ఈ పరీక్ష కింది మూడు విభాగాలను కలిగి ఉంటుంది.
1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు.
2. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు,
3. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు,
◆ప్రతి ప్రశ్నకు 1- మార్క్ కేటాయిస్తారు,
◆రుణాత్మక మార్కులు ఉంటాయి.
◆ ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ ను కోత విధిస్తారు.
■ మెయిన్ పరీక్ష:
◆ ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
◆ ప్రశ్నలను ఆబ్జెక్టివ్ టైప్ లో అడుగుతారు.
◆ పరీక్షా సమయం: 2 గంటల 40 నిముషాలు.
ఈ పరీక్ష కింది నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది
1. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు,
2. జనరల్ ఇంగ్లీష్ నుండి 40 ప్రశ్నలు,
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు,
4. రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు.
ఎంపిక విధానం: వ్యక్తిగత భాష పరీక్ష, ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామ్) లో సాధించిన కనీస అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 759/- SC/ ST/ PED/ XS/ DXS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
వీరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.05.2021.
అధికారిక వెబ్సైట్: https://www.sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్:👇
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment