India Navy Recruitment 2021 || ఇండియన్ నేవీ నుండి సెయిలర్ ఫర్ ఆర్టిఫిషియల్ అప్రెంటీస్ మరియు సీనియర్ సెకండరీ రిక్రూట్ ఆగస్టు - 2021 బ్యాచ్ కోసం నోటిఫికేషన్ విడుదల.
ఇండియన్ నేవీ సెయిలర్ ఆర్టిపిసియల్ అప్రెంటిస్ మరియు సీనియర్ సెకండరీ రిక్రూట్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆగస్టు - 2021 బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు 2500
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ లో - 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
2. సీనియర్ సెకండరీ రిక్రూట్ లో - 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నోటిఫికేషన్ పూర్తివివరాలు వీడియొలో చూడండి.
విద్యార్హత:
1. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్, ఫిజిక్, సబ్జెక్టులతో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో మేథ్స్, ఫిజిక్, సబ్జెక్టులతో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు:
ఈ రెండు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 01, 2021 నుండి జూలై 03, 2021 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది
పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ భాషలలో ఉంటుంది.
దీనిలో మొత్తం నాలుగు సెషన్లు ఉంటాయి.
అవి 1. ఇంగ్లీష్ 2. సైన్స్, 3. మేథ్స్, 4. జనరల్ నాలెడ్జ్.
ప్రశ్నాపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది.
రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అదేరోజు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కి హాజరు కావాలి.
ఈ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ కాలంలో రూ. 14,600/- ప్రతినెల, లెవెల్ 3 ప్రకారం రూ. 21,700/- నుండి రూ. 69,100/- మరియు అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.04.2021 నుండి.
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.04.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్:https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment