How to Register Corona Vaccine Online || కరోనా వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండిలా.. || User guide available here. @elearningbadi.in
కరోనా వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
ముఖ్యాంశాలు:
◆శనివారం నుండి(28.04.2021) 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ 'కొవిన్' వెబ్సైట్లో నమోదు చేసుకున్నవారికే వ్యాక్సిన్.
◆ 'ఆరోగ్య సేతు' యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
◆ స్పాట్ రిజిస్ట్రేషన్ లు ఉండవని అధికార వర్గాలు వెల్లడిం.
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 18 సంవత్సరాలకు పైబడిన వారందరూ అధికారిక పోర్టల్ ద్వారా లాగిన్ అయి నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇలా నమోదు చేసుకున్న వారందరికీ మే 1 (శనివారం) నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే 'కొవిన్' అధికారిక వెబ్ పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకొని ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకాను ఇవ్వనున్నట్లు ఆదివారం (25.04.2021) అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ లను అనుమతించబోమని తెలిపారు.
18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఈ టీకాల కార్యక్రమం మొదలవగానే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నదని దీనితో గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చు నాని అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకు,18-44 సంవత్సరాల వయసు ఉన్నవారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు తెలిపారు. 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని పీకాక్ కేంద్రంలో సైతం వాళ్లు పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
■ ఇప్పటికే వినియోగంలో కోవాగ్జిన్, కొవిషీల్డ్.
◆ కోవాగ్జిన్: భారత్ లో తయారైన అంతర్జాతీయ టీకా, హైదరాబాదీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. దీనిని ఇన్ఆక్టివ్టెడ్ వైరస్ విధానంలో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో కరోనా వైరస్ ను నిర్వీర్యంచేసి టీకా తయారు చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించి... నిజమైన వైరస్ వచ్చినట్లు భావించి ప్రతి రక్షక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా కరోనా వైరస్ సోకితే ఇది వెంటనే అడ్డుకుంటుంది. దీని సామర్థ్యం 81 శాతం. దీనిని సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయవచ్చు.
◆ కొవిషీల్డ్: బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. మనదేశానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది. పూర్తి కొవిడ్-19 వైరస్ రాకుండా దాని కొమ్ము (స్పైక్) ఆధారంగా ఈ టీకాను అభివృద్ధి చేశారు. సాధారణ జలుబు కలిగించే ఆడినో వైరస్ లో కొవిడ్-19 వైరస్ లోని స్పైక్ ప్రొటీను (జన్యుపదార్థం) ప్రవేశపెడతారు. అడినో వైరస్ కరోనా మాదిరిగా స్పైకను ఉత్పత్తి చేస్తుంది. ఈ టీకాను వేసినప్పుడు మన శరీరం కరోనా వైరస్ వచ్చినట్టుగా భావించి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ టీకా సామర్థ్యం 81.3 శాతంగా పేర్కొంటున్నారు. దీనిని సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయవచ్చు.
● 'కొవిన్' పోర్టల్ లో రిజిస్టర్ అవ్వండి లా...
1. 'కొవిన్' అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్. https://www.cowin.gov.in/
3. ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి లాగిన్ పై క్లిక్ చేయండి.
4. పనిచేస్తున్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి.
5. సంబంధిత మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. వచ్చినటువంటి ఓటిపి ను ఎంటర్ చేసి వేరిఫై బటన్ పై క్లిక్ చేయండి.
6. ఫోటో ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్/ ఓటర్ ఐడి, లో నుండి ఒకదాన్ని ఎంపిక చేసుకోండి. తర్వాత పేరు, జండర్, మొదలగు వివరాలను ఎంటర్ చేసి ఐడి సాఫ్ట్ కాఫీ ను అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు కరెక్టుగా ఎంటర్ చేశారని నిర్ధారించుకున్న తర్వాత రిజిస్టర్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.
6. మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైనదని మెసేజ్ కనిపిస్తుంది. ఈ పేజీలో అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
7. ఇక్కడ కనిపిస్తున్న షెడ్యూల్ అపాయింట్మెంట్ బటన్ పై క్లిక్ చేయండి.
8. రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలతో పాటు, ప్రైవేటు దవాఖానాలు ఏర్పాటుచేసిన కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన టీకా, ప్రాంతమును బట్టి అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అనంతరం అపాయింట్మెంట్ వివరాలతో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సందేశం వస్తుంది.
● ఆరోగ్య సేతు లో రిజిస్టర్ అవ్వండి లా...
1. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2. హోం పేజీలోని 'కొవిన్' ట్యాబ్ పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
4. అందులో వ్యాక్సినేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'రిజిస్టర్ నౌ' బటన్ పై క్లిక్ చేయాలి.
5. రిజిస్ట్రేషన్ కోసం మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. (అనంతరం... 'కొవిన్' హోటల్లో అనుసరించిన విధానాన్ని పాటించాలి).
ఆరోగ్య సేతు లో రిజిస్టర్ అవ్వండానికి వీడియొ చూడండి.👇
★ ముఖ్యమైన వివరాలు:
వ్యాక్సినేషన్ కి అర్హులు: 18 సంవత్సరాలు పైబడినవారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: బుధవారం (ఏప్రిల్ 28) నుండి.
పేర్లు నమోదు వేదికలు: కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం: శనివారం (మే 1) నుండి.
రిజిస్టర్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.cowin.gov.in/
కరోన విషయం లో భయపడవద్దు, అజాగ్రత్తగా ఉండవద్దు. జాన విజ్ఞాన వేదిక నుంచి సమాచారం. (Self Assissment Protocol):👇
కోవిడ్ టీకా నమోదు యూజర్ మాన్యువల్:👇
Comments
Post a Comment