NWDA Recruitment 2021 || నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(NWAD) నుండి జల శక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునర్జీవనం, కింద భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థ భారత ప్రభుత్వం దాని ప్రధాన కార్యాలయం మరియు వివిధ క్షేత్ర కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు, వయస్సు, విద్యార్హత, పే స్కేల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
1. జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో- 16.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18-27 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-6 ప్రకారం రూ. 35,400/- నుండి 1,12,400/-.
2. హిందీ ట్రాన్స్‌లేటర్ విభాగంలో - 1.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హిందీలో మాస్టర్ డిగ్రీ, మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను చదివి ఉండాలి.
వయసు: 21-30 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-6 ప్రకారం రూ. 35,400/- నుండి 1,12,400/-.
3. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ విభాగంలో - 5.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో క్యాప్ ఫండ్ అకౌంట్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 21-30 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-6 ప్రకారం రూ. 35,400/- నుండి 1,12,400/-.
4. అప్పర్ డివిజన్ క్లర్క్ విభాగంలో - 12.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. మరియు MS Word, Office, Excell, PowerPoint & INTERNET మొదలగు కంప్యూటర్ నాలెడ్జ్ ను కలిగి ఉండాలి.
వయసు: 18-27 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-4 ప్రకారం రూ. 25,500/- నుండి 81,100/-.
5. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 విభాగంలో - 5.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పై నిమిషానికి 80 పదాలను టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: 18-27 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-4 ప్రకారం రూ. 25,500/- నుండి 81,100/-.
6. లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో -23.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పై ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: 18-27 సం౹౹ రాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్-2 ప్రకారం రూ. 19,900/- నుండి 63,200/-.
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.👇
దరఖాస్తు ఫీజు:
జనరల్ మరియు ఓబీసీలకు రూ. 840/-.
ఎస్సీ/ ఎస్టీ, మహిళా, ఈడబ్ల్యూఎస్ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ. 500/-.
ఎంపిక ప్రక్రియ:
1. జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు UDC లకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 మరియు LDC లకు కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ తో స్కిల్ టెస్ట్( షార్ట్ హ్యాండ్/ టైపింగ్) నిర్వహిస్తారు.
3. కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ అర్హత సాధించిన అభ్యర్థులకు స్కేల్ టెస్ట్‌ను నిర్వహించి తుది జాబితాను ప్రకటించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.05.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.06.2021.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://www.nwda.gov.in/
నోటిఫికేషన్ పూర్తివివరాలకు వీడియొ చూడండి:
Comments
Post a Comment