Southern Railway Apprentice Recruitment 2021 || సదరన్ రైల్వే నుండి 3378 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి శుభవార్త!
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ - RRB తో పాటుగా భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్, మరియు రైల్వే జోన్ లు వేరువేరుగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా దక్షిణ రైల్వే తాజాగా వివిధ విభాగాలలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మొత్తం 3378 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 3378
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్ మొదలగు విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
★ క్యారేజ్ వర్క్, పెరంబుర్ క్రింద ఖాళీల వివరాలు - 936
★ గోల్డెన్ రాక్ వర్క్ షాప్, పెరంబుర్ క్రింద ఖాళీల వివరాలు- 756
★ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ వర్క్ షాప్ క్రింద ఖాళీల వివరాలు - 1686
పూర్తి వివరాలకు, వివరణాత్మక నోటిఫికేషన్ చదవండి.
క్యారేజ్ వర్క్, పెరంబుర్ నోటిఫికేషన్: 👇
గోల్డెన్ రాక్ వర్క్, షాప్ పెరంబుర్ నోటిఫికేషన్: 👇
సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ వర్క్ షాప్ నోటిఫికేషన్:👇
దరఖాస్తుదారులకు ముఖ్య సూచనలు:
క్రింద పేర్కొన్న టువంటి భౌగోళిక ప్రాంతాలలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
1. తమిళనాడు రాష్ట్రం మొత్తం.
2. పోదుచ్చేరి యూనియన్ టెరిటరీ మొత్తం.
3. కేరళ రాష్ట్రం మొత్తం.
4. అండమాన్ & నికోబార్ మరియు లక్షద్వీప్ దీవుల మొత్తం యూనియన్ భూభాగాలు.
5. కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లా.
6. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలు నెల్లూరు మరియు చిత్తూరు.
ఈ పై పేర్కొన్న భౌగోళిక పరిసరాలలోని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2021,
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:
1. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://sr.indianrailways.gov.in/index.jsp
2. హోం పేజీలో కనిపిస్తున్న టువంటి మెయిన్ మెనూ లో న్యూస్ అండ్ అప్డేట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు క్రింద కనిపిస్తున్న అటువంటివాటిలో పర్సనల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇందులో ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ 2021-22 లింక్ పై క్లిక్ చేయండి, ఈ లింక్ పై క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో విభాగాల వారీగా నోటిఫికేషన్స్ కనిపిస్తాయి.
● పెరంబుర్ లోని క్యారేజ్ వర్క్స్,
● గోల్డెన్ రాక్ వర్క్ షాప్,
● పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్,
వాటి కింద కనిపిస్తున్న అటువంటి రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత యూనిట్ ను ఎంపిక చేసుకొని దరఖాస్తులు చేసుకోవాలి.
5. ఆన్లైన్ లో విజయవంతంగా దరఖాస్తులను సమర్పించిన తరువాత, సంబంధిత అప్లికేషన్‌ను భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://sr.indianrailways.gov.in/
దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్: https://iroams.com/Apprentice/recruitmentIndex
Comments
Post a Comment