AIIMS Teaching Faculty Recruitment 2021 || ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరక్ పూర్, నుండి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరక్ పూర్, నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది ఉద్యోగాల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ - 2021 ఆధారంగా మొత్తం 127 ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 127 ప్రకటించారు.
ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్లు - 30,
2. అడిషనల్ ప్రొఫెసర్లు - 22,
3. అసోసియేట్ ప్రొఫెసర్లు - 29,
4. అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 56.
విభాగాలు: అనస్తీసియాలజి, అనాటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ & ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రో బయాలజీ, న్యూరో సర్జరీ, అఫ్తాల్మొలజీ, ఆర్థోపెడిక్, సైకాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్.. మొదలగునవి.
విద్యార్హత: వివిధ విభాగాలను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండి/ ఎంఎస్ పూర్తి చేసి ఉండాలి, మరియు బోధన/ పరిశోధన రంగంలో నిర్దేశిత అనుభవం తప్పనిసరి.
వయసు: ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల వయసు 58 సంవత్సరాల కు మించకూడదు.
అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్ ల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.3000/- (మహిళలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.200/-)
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.06.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://aiimsgorakhpur.edu.in/
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: http://ec2-15-206-251-190.ap-south-1.compute.amazonaws.com/aiims_grp/admin/
Comments
Post a Comment