TTWRAFPDC Admission test 2021 || గిరిజన సంక్షేమ గురుకుల సైనిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
గిరిజన సంక్షేమ సైనిక గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం B.SC(M.P.C), B.A(H.E.P) కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ: హైదరాబాద్
వరంగల్ జిల్లా, అశోక్ నగర్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం B.SC (M.P.C), B.A(H.E.P) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత ఆసక్తి కలిగిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది.
ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో బోధన తో పాటు మిలిటరీ సంబంధిత అంశాలను ప్రధానంగా బోధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అడ్మిషన్ వివరాలు:
ఇన్స్టిట్యూట్ పేరు: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అశోక్ నగర్ వరంగల్ జిల్లా.
విద్యా సంవత్సరం 2021-22 కు గాను డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కోర్సుల వివరాలు:
1. B.Sc(M.P.C)
2. B.A(H.E.P)
సీట్ల వివరాలు:
1. B.Sc(M.P.C) లో - 40 సీట్లు
2. B.A(H.E.C) లో - 40 సీట్లు.. ఇలా మొత్తం 80 సీట్లు ఉన్నాయి.
వరంగల్ జిల్లా, అశోక్ నగర్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్ క్రింది విధంగా ఉంటుంది.
1. ఇంటర్మీడియట్ లో చదివిన అకడమిక్ సబ్జెక్టుల ఆధారంగా రాతపరీక్ష.
2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
3. సైకో అనలిటికల్ టెస్ట్
4. మెడికల్ టెస్ట్
4. పర్సనల్ ఇంటర్వ్యూ.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి...👇
విద్యార్హత: గుర్తింపు పొందిన జూనియర్ కాలేజ్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది
తెలుగు మీడియం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
వయసు: ప్రవేశం పొందే అభ్యర్థుల వయస్సు జూలై 1 2021 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎత్తు: కనీసం 152 సెంటీమీటర్ల ఉండాలి.
ఆదాయం: కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1 లక్ష్య, 50 వేల రూపాయలకు మించకూడదు.
స్క్రీనింగ్ టెస్ట్ మరియు పెరామీటర్ వివరాలు:
రాత పరీక్ష: ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగా వంద మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
ఫిజికల్ టెస్ట్: ఇందులో 100 మీటర్ల స్ప్రింట్, 400 మీటర్ల పరుగు పందెం, సిటప్, షటిల్ రేస్, అబస్టాకిల్ టెస్ట్ ఉంటాయి.
సైకో అనలిటికల్ టెస్ట్: ఇందులో థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్(టీఏటీ) ఒక బొమ్మ, వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ) పది పదాలు, సిచువేషన్ రియాక్షన్ టెస్ట్(ఎన్ఆర్టీ)-5 ఎన్అర్టీ లు ఉంటాయి.
మెడికల్ టెస్ట్: ఇందులో నియామకాలకు అనుగుణంగా ఎత్తు 152 సెంటీమీటర్లు, బరువు చెక్ చేస్తారు, కళ్ళు, చెవులు, పళ్ళు, ఫ్లాట్ ఫ్లాట్, నాక్ నిస్, వర్ణాంధత్వం సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉన్నాయా, సర్జరీలు జరిగాయా అన్న విషయాలను చెక్ చేస్తారు.
లెక్చర్టి: ఇందులో భాగంగా ఒక అంశం ఇచ్చి లెక్చర్ ఇవ్వమని అడుగుతారు.
పర్సనల్ ఇంటర్వ్యూ: చివరిగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
తప్పక చదవండి: TSWRAFPDCW Admission test for girls 2021 || తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. దరఖాస్తుల కు చివరి తేదీ: 31.05.2021.
ఫలితాల వేయిటేజి:
1. పద వ తరగతి లో సాధించిన మార్కులకు 5%
2. ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులకు 5%
3. రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభకు 5%
4. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కు 15%
5. అబస్టాకిల్ టెస్ట్ కు 5%
6. సైకాలజికల్ టెస్ట్ కు 20%
7. లెక్చరర్ టెస్ట్ కు 15%
8. పర్సనల్ ఇంటర్వ్యూ కు 30%
ఇలా మొత్తం 100% మార్పులతో ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ కళాశాలలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీలను తపనిసరిగా కలిగి ఉండాలి.
1. కుల ధ్రువీకరణ పత్రం.
2. ఆదాయ ధ్రువీకరణ పత్రం.
3. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్.
4. బోనఫైడ్ సర్టిఫికెట్.
5. మార్క్ షీట్ లేదా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్.
6. ఆధార్ కార్డ్.
7. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
8. ఆరోగ్య శ్రీ/ రేషన్ కార్డులను జతచేయాలి.
సందేహాల నివృత్తి కోసం 9121174434 నంబర్ కు కాల్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.05.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.05.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://ttwrdcs.ac.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment