NIMHN Recruitment 2021 || బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్ హాన్స్) వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 275 ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, అర్హత ప్రమాణాలు, వయసు, అనుభవం, వేతనం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరో మస్క్యులర్) - 1,
విద్యార్హత: బేసిక్/ మెడికల్ సైన్సెస్ లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700/-చెల్లిస్తారు.
2. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 1,
విద్యార్హత: కంప్యూటర్ అప్లికేషన్స్ లో బిజీ డిప్లమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్ అప్లికేషన్స్ లో నాలెడ్జి కలిగి ఉండాలి. హెల్త్ ఫీల్డ్ డాటాబేస్ హ్యాండ్లింగ్ అనుభవం ను కలిగి ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు.
3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - సబ్ స్పెషాలిటీ బ్లాక్ - 1,
విద్యార్హత: పోర్ట్ ఎండి/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, ఏమిటి అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.44,900/- చెల్లిస్తారు.
4. నర్సింగ్ ఆఫీసర్ - 266,
విద్యార్హత: బిఎస్సి(ఆనర్స) నర్సింగ్/ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో, 50 పడకల ఆసుపత్రిలో సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.44,900/-చెల్లిస్తారు.
5. స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ - 3,
విద్యార్హత: స్పీచ్ పాథాలజీ/ ఆడియాలజీ/ తత్సమాన సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు.
6. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనిటిక్స్) - 1,
విద్యార్హత: లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీ/ తమన డిగ్రీ అర్హతతో, సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు.
7. టీచర్ ఫర్ ఎన్ ఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ) - 1,
విద్యార్హత: సైకాలజీ సబ్జెక్ట్ లొ బిఏ/ బిఎస్సి ఉత్తీర్ణతతో, సాధారణ/ వికలాంగుల పాఠశాలలో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు.
8. అసిస్టెంట్ డైటీషియన్ - 1,
విద్యార్హత: సైన్స్ లో బిఎస్సీ డిగ్రీ తో పాటు డైటిక్స్ లో డిప్లమా ఉత్తీర్ణత తో, ఏదైనా మేజర్ హాస్పిటల్ లో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2021
అధికారిక వెబ్సైట్: https://nimhans.ac.in/
అధికారిక నోటిఫికేషన్:
అప్లికేషన్ ఫామ్:
Comments
Post a Comment