DSSSB Teaching Staff Recruitment 2021 || ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 5807 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే...
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్ సి టి ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి 5807 టీచర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మరొక నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 5807 ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొ లో..
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (బెంగాలీ) మహిళల విభాగంలో - 01,
2. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్) పురుషుల విభాగంలో - 1029,
3. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్) మహిళల విభాగంలో - 961,
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఉర్దూ) పురుషుల విభాగంలో - 346,
5. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఉర్దూ) మహిళల విభాగంలో - 571,
6. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సంస్కృతం) పురుషుల విభాగంలో - 866,
7. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సంస్కృతం) మహిళల విభాగంలో - 1159,
8. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (పంజాబీ) పురుషుల విభాగంలో - 382,
9. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (పంజాబీ) మహిళల విభాగంలో - 492.. ఇలా మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 5807 టిజిటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 45 శాతం మార్కులతో మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ (ఎంఐఎల్) లో ఏదో ఒక సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ (ఆనర్స్), సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
హిందీలో పరిజ్ఞానం ఉండాలి.
మరియు సీబీఎస్సీ నిర్వహించిన సీ టెట్లో అర్హత పొంది ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు.
ఆదిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
●ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు.
●ఓబీసీలకు 3 సంవత్సరాలు
పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: వన్ టైర్/ టూ టైర్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://dass.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment