NMDC Apprenticeship Training Recruitment 2021 || నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NMDC Ltd) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 59 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 59
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లో -16,
2. టెక్నికల్ అప్రెంటిస్ లో - 13,
3. ప్రోగ్రామింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ లో - 30.. ఇలా మొత్తం 59 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.
విద్యార్హత:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ మొదలగు కోర్సులలో నాలుగు సంవత్సరాల డిగ్రీ/(బీఈ/ బీటెక్) ఉత్తీర్ణులై ఉండాలి.
స్కాలర్షిప్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- చెల్లిస్తారు.
2. టెక్నీషియన్ అప్రెంటిస్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సులో మూడు సంవత్సరాల డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్కాలర్షిప్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,000/- చెల్లిస్తారు.
3. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లో (NCVT) నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
స్కాలర్షిప్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000/-చెల్లిస్తారు.
శిక్షణ కాలం: 1 సంవత్సరం.
ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లమా, ఐటిఐ లలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ఆధారంగా తుది ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2021.
ఈ-మెయిల్ అడ్రస్: bld5hrd@nmdc.co.in
అధికారిక వెబ్సైట్: https://www.nmdc.co.in/
అధికారిక నోటిఫికేషన్: 👇
నోటిఫికేషన్ పూర్తి వివరాలు videolo👇
Comments
Post a Comment