NTPC EET Recruitment 2021 || బీఈ, బీటెక్ విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...
బిఈ, బీటెక్ విద్యార్థులకు శుభవార్త!.
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎటువంటి రాతపరీక్ష లేకుండా, భారీ వేతనంతో అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి నుండి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 280 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఎలక్ట్రికల్ విభాగంలో - 98,
2 మెకానికల్ విభాగంలో - 126,
3. ఎలక్ట్రానిక్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో - 56..
ఇలా మొత్తం రెండు వందల ఎనభై పోస్టులను గేట్-2021 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
విద్యార్హత: అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 65 శాతం మార్కులతో ఫుల్ టైం బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవద్దని ప్రకటనలో పేర్కొన్నది, మరియు వ్యాలీడ్ గేట్-2021 స్కోర్ అర్హతను కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ ఎస్ టి/ ఓబిసి/ పిడబ్ల్యుబీడి/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్:👇
ఎంపిక విధానం: గేట్ స్కోర్-2021 ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు, ఎంపికైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి NTPC యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది.
జీతం: నెలకు రూ.40,000/- నుండి రూ.1,40,000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.05.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.06.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.ntpc.co.in/
దరఖాస్తులు చేయడానికి డైరెక్ట్ లింక్: https://ntpccareers.net/et2021/hm.php
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
Comments
Post a Comment