IBPS RRBs CRP RRBs X Recruitment2021 || ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్ ఆర్ బీ) ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్లు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
(తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయి.)
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 10,467 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) - 5096,
2. ఆఫీసర్ స్కేల్ -1(అసిస్టెంట్ మేనేజర్) - 4119,
3. ఆఫీసర్ స్కేల్ -2(అగ్రికల్చర్ ఆఫీసర్) - 25,
4.ఆఫీసర్ స్కేల్ -2(మార్కెటింగ్ ఆఫీసర్) - 43,
5.ఆఫీసర్ స్కేల్ -2(ట్రెజరీ మేనేజర్) - 10,
6.ఆఫీసర్ స్కేల్ -2(లా) - 27,
7.ఆఫీసర్ స్కేల్ -2(సీఏ) - 32,
8.ఆఫీసర్ స్కేల్ -2(ఐటీ) - 59,
9.ఆఫీసర్ స్కేల్ -2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్) - 905,
10.ఆఫీసర్ స్కేల్ -3 - 151.. ఇలా మొత్తం 10,000 పోస్టులకు పైగా.. ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
వివిధ రకాల పోస్టులకు, వివిధ రకాల విద్యార్హతలు కలిగి ఉండాలి. వాటి వివరాలు క్రింద వివరంగా ఇవ్వబడ్డాయి.
1. ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
● ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి
● కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
2. ఆఫీసర్ స్కేల్ -1(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. (విభాగాలు: అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ మరియు అకౌంటెన్సీ).
● ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి
● కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
3. ఆఫీసర్ స్కేల్ -2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) పోస్టులకు విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. (విభాగాలు: బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ మరియు అకౌంటెన్సీ).
అనుభవం: బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆఫీసర్ గా 2 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
4. ఆఫీసర్ స్కేల్- 2 స్పెషల్ ఆఫీసర్స్ (మేనేజర్) పోస్టులకు విద్యార్హత:
● ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దానికి సమానమైన బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఏఎస్పి, పిహెచ్పి, సి++, జావా, విబి, విసి, ఓసిపి తదితర కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
● చార్టెడ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుండి(సీఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: చార్టెడ్ అకౌంట్ ఆఫీసర్ గా ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
● లా ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
అనుభవం: రెండు సంవత్సరాలు న్యాయవాదిగా లేదా బ్యాంకులు/ ఆర్థిక సంస్థల్లో లా ఆఫీసర్ గా కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
● ట్రెజరీ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి చార్టెడ్ అకౌంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణత.
అనుభవం: సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
● అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చర్/ హార్టికల్చర్/ డైరీ/ యానిమల్ హజ్బెండరీ/ ఫారెస్ట్రీ/ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ ఫిషి కల్చర్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: సంబంధిత ఫీల్డ్ లో రెండు సంవత్సరాలు అనుభవం ఉండాలి.
5. ఆఫీసర్ స్కేల్ -3(సీనియర్ మేనేజర్) పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.(విభాగాలు: డిగ్రీ/ డిప్లామా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫీషి కల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ.)
అనుభవం: బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆఫీసర్ గా ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
ఆన్లైన్ టెస్ట్ రెండు విభాగాలుగా ఉంటుంది.
1. ప్రిలిమినరీ, 2. మెయిన్ ఎగ్జామ్.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2021.
ఆన్లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరి): ఆగస్ట్ 2021.
ఆన్లైన్ ఎగ్జామినేషన్ (మెయిన్): సెప్టెంబర్/ అక్టోబర్ 2021.
పరీక్ష పేపర్:
● తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష పేపర్ ప్రాంతీయ భాషల్లో ఉంటుంది.
● ఆంధ్రప్రదేశ్ వారికి: తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో...
● తెలంగాణ వారికి: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరియు ఉర్దూ భాషల్లో...
తెలుగు రాష్ట్రాల వారికి పరీక్ష సెంటర్లు:
● ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమినరీ పరీక్ష సెంటర్లు: అనంతపురం, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం.
◆మెయిన్ పరీక్ష సెంటర్లు: గుంటూరు, కర్నూల్, విజయవాడ.
● తెలంగాణలో ప్రిలిమినరీ పరీక్ష సెంటర్లు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
◆ మెయిన్ పరీక్ష సెంటర్లు: హైదరాబాద్, కరీంనగర్.
దరఖాస్తు ఫీజు: రూ.850/-.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్-సర్వీస్మెన్ లకు: రూ.175/-.
అధికారిక వెబ్సైట్: https://ibps.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.ibps.in/crp-rrb-x/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం వీడియొలో
Comments
Post a Comment