BIS Recruitment 2021 || బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సైంటిస్ట్-'బీ' ఉద్యోగాల.. పూర్తివివరాలివే...
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీ ఐ ఎస్) వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆహార మరియు ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం జాతీయ స్టాండర్డ్ బాడీ ఆఫ్ ఇండియా మరియు స్టాండర్డైజేషన్, ప్రొజెక్టర్ రూపంలో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తూ పరిపాలన నియంత్రణ లో ఉన్న చట్టబద్ధమైన సంస్థ. మరియు బంగారం/ సిల్వర్ జువెలరీ ఈ యొక్క హాల్మార్కింగ్, ప్రయోగశాల పరీక్ష మొదలైన సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రామాణీకరణ మరియు ధ్రువీకరణ దేశం, అంతర్జాతీయ స్థాయిలో (బీ ఐ ఎస్) బాధ్యత వహిస్తూ.. ప్రమాణాలను మెరుగుపరచడానికి మెరుగైన యువ భారతీయ పౌరులు నుండి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్-'బీ' ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 28 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సివిల్ ఇంజనీరింగ్ - 13,
2. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 02,
3. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ - 02,
4. కెమిస్ట్రీ - 02,
5. టెక్స్ టైల్ ఇంజనీరింగ్ - 04.. ఇలా 28 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.
విద్యార్హత: సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, టెక్స్ టైల్ ఇంజనీరింగ్ మొదలగు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. షెడ్యూల్ కేటగిరీల వారు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
25 జూన్, 2021 నాటికి గేట్ స్కోర్ తప్పనిసరి.
కెమిస్ట్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేచురల్ సైన్స్ లేదా కెమిస్ట్రీ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
25 జూన్, 2021 నాటికి గేట్ స్కోర్ తప్పనిసరి.
వయసు: జూన్ 25, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: గేట్ 2019, గేట్ 2020, గేట్ 2021 స్కోర్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఎంపిక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2021 నుండి...
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.06.2021.
దరఖాస్తు ఫీజు:రూ.100/-
ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన విధానం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://bis.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://bis.gov.in/index.php/recruitment-to-the-post-of-scientist-b-new/
Comments
Post a Comment