NGRI Technical officer Recruitment 2021 || ఎన్.జి.ఆర్.ఐ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు...
హైదరాబాదులోని సీఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్.జి.ఆర్.ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు 38 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్ లో - 21,
2. టెక్నికల్ ఆఫీసర్ లో - 2,
3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1 లో - 7,
4. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-2 లో - 4.
విద్యార్హత:
1. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లమా, బీఎస్సి ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
తప్పక చదవండి: TET Certificate Validate Extending ‖ TET సర్టిఫికేట్ ప్రామాణికత 7సంII నుండి జీవితకాలానికి పొడిగింపు..
2. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలకు మించి కూడదు.
4. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు సంబంధిత పనిలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: పోస్టులను అనుసరించి, సీరియల్ నెంబర్: 1, 2 (టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్) పోస్టులకు షాట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.. మరియు సీరియల్ నెంబర్: 3, 4 (సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-1, -2) పోస్టులకు షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.04.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.06.2021.
అధికారిక వెబ్సైట్: https://www.ngri.org.in/
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకుడైరెక్ట్ లింక్: https://rectt.ngri.res.in/
Comments
Post a Comment