TET Certificate Validate Extending ‖ TET సర్టిఫికేట్ ప్రామాణికత 7సంII నుండి జీవితకాలానికి పొడిగింపు..
ఉపాధ్యాయవృతి లో స్థిరపదలనుకునే వారికి శుభవార్త!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ సర్టిఫికేట్ ఏడు సాంవత్సరాల గడువును ఎత్తివేస్తూ.. జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఒక ప్రకటనలో సూచించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేస్తూ.. గతంలో కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటూ వంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్రం ఆదేశానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్‌ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్‌లో పాసైతే దాని వ్యాలిడిటీ (కల పరిమితి) ఏడు సాంవత్సరాల పాటు ఉంటుంది. ఈ లోపల ఉద్యోగం సాధిస్తే పరవాలేదు, లేదంటే మళ్లీ అర్హత సాధించాల్సి ఉంటుంది.
కేంద్రప్రభుత్వ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు ఒకసారి టెట్ పాసైతే, ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా అభ్యర్థులు మరికొందరికి లబ్ధి చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది. ‘‘ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం దోహదపడుతుంది’’ అని కేంద్ర విద్యా శాఖ మంత్రి పోఖ్రియాల్ అన్నారు. అయితే ఇప్పటికే టెట్ అర్హత సాధించి ఏడు సాంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త ధ్రువపత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2011 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇది వర్తించనుంది ప్రకటనలో తెలిపారు.
TET Eligibility Life Time Validity Order Copy
NCERT ఆర్డర్ కోఫీ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టెట్ డూప్లికేట్ సర్టిఫికేట్/ మార్క్ షీట్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
NCTE 03.03.2021 నిర్వహించిన సమావేశపు మినిట్స్ పిడిఎఫ్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
అదికారిక వెబ్ సైట్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment