Indian Air Force Recruitment 2021 || భారత వైమానిక దళం లో టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎఫ్ క్యాట్ - 2021.
భారత వైమానిక దళం లో టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలని ఆశించే వారికి చక్కని మార్గం "'ఏఎఫ్ క్యాట్' (ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్)". ఏఎఫ్ క్యాట్ - 2021 నోటిఫికేషన్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది.
ఈ పరీక్ష ద్వారా ఎయిర్ ఫోర్స్ లో పర్మినెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ స్థాయి ఉద్యోగాల్లో చేరవచ్చు.
బ్రాంచీలు, కోర్స్ ఖాళీల వివరాలు:
1. ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ బ్రాంచ్ లు:
● ఫ్లయింగ్ లో - 96,
● గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) లో - 137,
● గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) - 73.
2. ఎన్ సీ సీ స్పెషల్ ఎంట్రీ బ్రాంచ్:
● ఫ్లయింగ్.
3. మెటీరియల్ అది ఎంట్రీ బ్రాంచ్:
● మెటీరియలజీ లో - 28.
ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) ఖాళీల భర్తీకి ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది. ఇందులో పర్మినెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అనే రెండు రకాలు ఉంటాయి. పర్మినెంట్ కమిషన్ క్రింద ఎంపికైనవారు పదవీ విరమణ వయస్సు వచ్చేవరకు ఉద్యోగంలో ఉంటారు. కానీ షార్ట్ సర్వీస్ కమిషన్ క్రింద నియామకమైన వారు మాత్రం కేవలం 14 సంవత్సరాల సర్వీస్ లో ఉంటారు.
అదేవిధంగా ఎన్ సీ సీ ఉద్యోగాలు ఉంటాయి. మహిళలు ఈ ఎస్ఎస్సి ఉద్యోగాలకే అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టు లైనా పైలెట్ ఉద్యోగాలన్నీ ఎస్ఎస్సి పరిధిలోకి వస్తాయి. గ్రౌండ్ డ్యూటీ పోస్టులను పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ రెండు విభాగాల్లోనూ భర్తీ చేస్తారు.
విద్యార్హత:
ఫ్లయింగ్ బ్రాంచ్: అభ్యర్థులు ఇంటర్లో మేథ్స్, ఫిజిక్ చదివి, 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ లేదా మెకానికల్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో ఏదో ఒక విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ మిడియట్ లో ఫిజిక్స్, మేథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు:
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ కు వయసు: 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ కు వయసు: అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంట్ విభాగానికి 60 శాతం మార్కులతో బీకాం పాస్ అయి ఉండాలి.
వయసు: 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ నాలెడ్జి టెస్ట్ పైలెట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పిఎబిటి), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్ట్ ఏదైనప్పటికీ అభ్యర్థులు అందరికీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది.
టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జి టెస్ట్ (ఈకేటి) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కు స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు.
ఫ్లయింగ్ బ్రాంచ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ నాయుడు పైలెట్ సెలక్షన్ సిస్టం (సీ పీ ఎస్ ఎస్) పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను ఇంటర్వ్యూ తర్వాత నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అన్నింటిలో అర్హత సాధించిన వారికి, మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలో తీసుకుంటారు.
పరీక్ష విధానం:
పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు.
మొత్తం 300 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.
ప్రశ్నలు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటాయి.
పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
100 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు.
ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కట్ చేస్తారు.
టెక్నికల్ బ్రాంచ్ వారికి నిర్వహించే ఈకెటి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
50 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఇస్తారు.
మొత్తం మార్కులు 150.
సిలబస్:
జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టాపికల నుండి ప్రశ్నలు వస్తాయి.
న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయిలోనూ ఉంటాయి.
జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు,
న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు,
రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 35 ప్రశ్నలు వస్తాయి.
ఏఎఫ్ఎస్బి:
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఏ ఎఫ్ ఎస్ బి) నిర్వహించే స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలకు పిలుస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో అభ్యర్థులు 16 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. 10 పుష్ అప్స్. 3 చిన్ అప్స్ తీయగలగాలి.
స్టేజ్-1 స్క్రీనింగ్ టెస్ట్ లో చిన్న అసైన్మెంట్, పజిల్ ఇలాంటివి నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 పరీక్షకు పిలుస్తారు. సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్-2 లో అర్హత సాధించిన వారికి ఫైనల్ గా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్.
శిక్షణ:
ఏఎఫ్ క్యాట్ లో ఎంపికైన ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాలపాటు, గ్రాండ్ డ్యూటీ కి ఎంపికైన వారికి 52 వారాలపాటు ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్, హకీంపేట్, బీదర్, ఎలాహంక ల్లో ఆరు నెలల ప్రాథమిక శిక్షణ ఉంటుంది.
శిక్షణా కాలంలో స్టయి ఫెండ్:
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టయి ఫెండ్ గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం రూ.56,100/- మూల వేతనం లభిస్తుంది. అంతేకాదు పోస్టింగ్ పొందిన ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.83,000/- నుండి రూ.96,000/- వేల వరకూ నెల వేతనం పొందవచ్చు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2021.
అధికారిక వెబ్సైట్: https://aflat.cdac.in/AFCAT/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment