NMDC Coal Mine Recruitment 2021 || కోల్ మైన్ లో వివిద ఉద్యోగాలు.. పూర్తివివరాలు తెలుసుకోండి...
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) జార్ఖండ్‌లోని టాకీస్ రోడ్డు నార్త్ కోల్ మైన్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 89 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ లో,
1. కొల్లియరీ ఇంజనీర్ (మెకానికల్) లో - 1.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మెకానికల్/ మైనింగ్ మిషనరీ లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత పనిలో కనీసం 7 సంవత్సరాల అనుభవం, మరియు ఎర్త్ మూవీ మిషనరీ నిర్వహణలో పెద్ద ఓపెన్ కాస్ట్ గనుల లో పని అనుభవం అవసరం.
జీతం: రూ. 90,000/-.
2. లైజనింగ్ ఆఫీసర్ లో - 2,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పీజీ డిగ్రీ/ సోషియాలజీ లో పిజి డిప్లమో/ సోషల్ నెట్ వర్క్ లేబర్ వెల్ఫేర్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత పనిలో కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ. 90,000/-.
3. కొల్లియరీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లో - 1,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో స్టేట్ ఎలక్ట్రికల్ జారీ చేసినటువంటి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కాంపిటేషన్సి (మైనింగ్) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత పనిలో కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.70,000/-.
4. మైనింగ్ ఇంజనీరింగ్ లో - 12,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అనుభవం: భారతదేశంలో ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ఆపరేషన్ లో డ్రిల్లింగ్, పేలుడు, ఉత్పత్తి, తవ్వకం, గనుల భద్రత, పర్యావరణం మొదలగు పనులలో కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ. 70,000/-.
5. సర్వేయర్ లో - 2,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైన్స్ & మైన్ సర్వేయర్ లో అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత పనిలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ. 60,000/-.
★ సూపర్వైజర్ గ్రేడ్ లో
1 ఎలక్ట్రికల్ ఓవర్ మేన్ లో - 4,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
అనుభవం: డిప్లమో హోల్డర్స్ కనీసం 5 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
జీతం: రూ. 50,000/-.
2. మైన్ ఓవర్ మెన్ లో - 25,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మైనింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: డిప్లమా హోల్డర్స్ ఓపెన్‌కాస్ట్ కోల్ మైన్స్ లో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవాన్ని కలిగి ఉండాలి.
జీతం: రూ. 50,000/-
3. మెకానిక్ ఓవర్ మెంట్లో - 4,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్/ మైనింగ్ మెషినరీ లో డిగ్రీ/ డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: డిప్లమా హోల్డర్స్ సంబంధిత పనిలో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ. 50,000/-.
★ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ లో,
1. మైన్ సిర్దార్ లో - 38,
విద్యార్హత: మెట్రిక్యులేషన్/ పదవ తరగతి ఉత్తీర్ణత తో వ్యాలీడ్ సిర్దార్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం: ఓపెన్ క్యాబ్ టోల్ మైన్ లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ. 40,000/-.
ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా, నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులకు రాత పరీక్ష, సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.06.2021.
అధికారిక వెబ్సైట్: https://nmdcctokisud.formflix.com/
అధికారిక నోటిఫికేషన్:
నోటిఫికేషన్ పుర్తు వివరాలు వీడియొలో
Comments
Post a Comment