Indian Railway RRC Apprentice Recruitment 2021 || వెస్ట్రన్ రైల్వే లో 3591 అప్రెంటిస్ ఉద్యోగాల.. పూర్తివివరాలివే...
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ముంబైలోని వెస్ట్రన్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్.ఆర్.సి) వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 3591 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 3591 ప్రకటించారు.
విభాగాలు:
డిసిగ్నటెడ్ ట్రేడ్, ఐటిఐ ట్రేడ్ వివరాలు:
1. ఫిట్టర్,
2. వెల్డర్,
3. టర్నర్,
4. మెకానిక్,
5. కార్పెంటర్,
6. పెయింటర్ జనరల్,
7. మెకానిక్ (డీజిల్),
8. మెకానిక్ (మోటార్ వెహికల్),
9. ప్రోగ్రామింగ్ & సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్,
10. ఎలక్ట్రీషియన్,
11. ఎలక్ట్రీషియన్ మెకానిక్,
12. వైర్ మెన్
● వైర్ మెన్,
● ఎలక్ట్రీషియన్.
13. రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్,
14. పైపు ఫిట్టర్,
15. ప్లంబర్,
16. డ్రాఫ్ట్ మెన్ (సివిల్),
17. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్).. మొదలగునవి..
తప్పక చదవండి: TET Certificate Validate Extending ‖ TET సర్టిఫికేట్ ప్రామాణికత 7సంII నుండి జీవితకాలానికి పొడిగింపు..
విద్యార్హత:
అకడమిక్: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/ పదవ తరగతి ఉత్తీర్ణత.
టెక్నికల్: NCVT (నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్)/ SCVT (స్టేట్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్) ఐటీఐ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: జూన్ 24, 2021 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయసు కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం: అకడమిక్ మరియు టెక్నికల్ కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు వారు రిజిస్టర్ చేసుకున్నప్పుడు నమోదు చేసినటువంటి మొబైల్ నెంబర్/ ఈమెయిల్ ఐడి లకు మెసేజ్ పంపడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి మహిళా అభ్యర్థుల కు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:
1. దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
3. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్, కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
4. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది, సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
5. ఇప్పటివరకు రిజిస్టర్ ఆ పని వారు, క్రింద కనిపిస్తున్న టువంటి రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసి, మీ సంబంధిత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.06.2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.rrc-wr.com/
అధికారిక నోటిఫికేషన్: 👇
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.rrc-wr.com/Tradeapp/Login/index
నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం వీడియొలో👇
Comments
Post a Comment