C-DAC Project Staff Recruitment 2021 ౹౹ సి-డ్యాక్ హైదరాబాదులో 44 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...
హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి-డ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 44 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రాజెక్ట్ మేనేజర్ లో - 03,
2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో - 39,
3. ప్రాజెక్ట్ ఆఫీసర్ -02.
■ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.64,000/- నుండి 89,000/-వరకు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
■ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.31,000/- ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
■ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది ప్రకటనలో పేర్కొన్నారు.
వయసు: ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.31,000/- ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభించబడినవి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.05.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.cdac.in/
అధికారిక నోటిఫికేషన్: https://www.cdac.in/index.aspx?id=ca_CDAC_HYD_Advt_Rect_03_2021_Ma
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...👇
నోటిఫికేషన్ పూర్తివివరాలకు వీడియొ చూడండి:
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment