Junior Residents Jobs || ఎయిమ్స్ లో జూనియర్ & సీనియర్ రెసిడెంట్లు ఉద్యోగాలు..
ఎయిమ్స్ మంగళగిరిలో జూనియర్ & సీనియర్ రెసిడెంట్లు ఉద్యోగాలు:
ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) మంగళగిరి లో ప్రధానమంత్రి స్వస్ స్వస్థ్య సురక్ష యోజన (PMSSY) పథకం కోసం ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్లు (నాన్ అకాడమిక్), సీనియర్ రెసిడెంట్ల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ, ఇంటర్వ్యూలను నిర్వహించి. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం 19 పోస్టులను ప్రకటించారు.
1. జూనియర్ రెసిడెంట్లు లో - 15.
రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు:
● జనరల్ అభ్యర్థులకు - 7,
● ఓబీసీలకు - 3,
● ఎస్సీలకు - 2,
● ఎస్టి లకు - 1,
● ఈడబ్ల్యూఎస్ లకు - 2 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: జూనియర్ రెసిడెంట్లు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాటికి ఇంటర్న్షిప్ తో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి 3 సంవత్సరాలు దాటకూడదు. 2018 మే 4 నుండి 2021 మే 3 మధ్య కోర్సు పూర్తి చేసిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూకి ముందే స్క్రీనింగ్ కమిటీ ధృవ పత్రాలను పరిశీలిస్తుంది. తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
వయసు: జూనియర్ రెసిడెంట్లు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఇంటర్వ్యూ తేదీ నాటికి 33 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
జీతం: నెలకు రూ. 91,952/-
2. సీనియర్ రెసిడెంట్లు లో - 4.
సీనియర్ రెసిడెంట్లు విభాగాలు:
● మైక్రో బయాలజీ
● గైనకాలజీ
● రేడియాలజీ
●జనరల్ మెడిసిన్,/ పల్మనరీ మెడిసిన్.
విద్యార్హత: సీనియర్ రెసిడెంట్లు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు పీజీ డిప్లామా/ ఎండి/ ఎంఎస్/ డి ఎన్ బి పూర్తి చేసి ఉండాలి. డిఎంసి/ ఎంసిఐ స్లెట్ రిజిస్ట్రేషన్ అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయసు: సీనియర్ రెసిడెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
జీతం: నెలకు రూ. 1,10,000/-.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో నిర్వహించు తేదీ: 03.05.2021.
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, మొదటి అంతస్తు, ఓపిడి బ్లాక్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా.
అధికారిక వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
జూనియర్ రెసిడెంట్లు నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్:👇
సినియర్ రెసిడెంట్లు నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్:👇
Comments
Post a Comment