AP Teacher Job 2022 | ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లో 207 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇంటర్ మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తును చేసుకోవచ్చు.
టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు సబ్జెక్టులు: (ఇంగ్లీష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్).
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు సబ్జెక్టులు: (ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్). మరియు ఆర్ట్ ఉపాధ్యాయులు.
పీజీటీ పోస్టులకు టీ ఆర్ టీ (పేపర్-1 పేపర్-2) ఆధారంగా, టీజీటీ పోస్టులకు టీ ఆర్ టీ (పేపర్-1 పేపర్-2) వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేశారు.
అభ్యర్థులకు 01-07-2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును 18-09-2022 నాటికి చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలలో ఉపాధ్యాయులుగా నియమితులవుతారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య: 207పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
01. పోస్టు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు(PGT)-176
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్.
02. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు(TGT)-31
సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.
03 .ఆర్ట్ ఉపాధ్యాయులు
జోన్01-62పోస్టులు,
జోన్02-04పోస్టులు,
జోన్03-48పోస్టులు,
జోన్04-93పోస్టులు.
విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో ఇంటర్మెడిట్, డిగ్రీ, పిజి, బీఈడీ అర్హతలు కలిగి ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత ఉండాలి.
వయో-పరిమితి:
01/07/2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాల మధ్య వయసు వుండాలి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందుగా నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభర్దులు 500రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. ఎంపిక చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.
హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.
పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.
ఫలితాల ప్రకటన: 04.11.2022







అడికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apdsc.apcfss.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment