CPRI Recruitment 2022| No Exam Required | BE BTech can apply online | check selection process here
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బీఈ/ బీటెక్ అర్హతతో ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:
1. భారతీయ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
2. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి.
3. అభ్యర్థులు పనిచేస్తున్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లను కలిగి ఉండాలి.
4. దరఖాస్తులో భాగంగా ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి.
5. అలాగే సంబంధిత అర్హత ధ్రువపత్రాలను కూడా అప్లోడ్ చేయాలి.
6. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
7. దరఖాస్తు ఫీజు ₹.200 రూపాయలు.
8. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ మహిళా అభ్యర్థులు/ CPRI డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
9. ఈ ఉద్యోగాలకు ఎంపిక లు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల వెరిఫికేషన్, మరియు గేట్ స్క్వేర్(2020/ 2021) ఆధారంగా నిర్వహిస్తారు.
10. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సంబంధిత సమాచారం అందించబడుతుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 14
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్/ కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్హతతో, 2020/ 2021 వైల్డ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
జీతం: Level-7 ప్రకారం ₹.44,900/-జీతంగా చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://cpri.res.in/
2. Latest News లోని సంబంధిత లింక్ పై క్లిక్ చేయండి.
3. Career పేజ్ ఓపెన్ అవుతుంది.
4. సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా ఉన్న Click here to Apply లింక్ పై క్లిక్ చేయండి.
5. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
6. Register లింక్ పై క్లిక్ చేయండి.
7. Valid ఈమెయిల్ ఐడి, Date of Birth ని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
8. సంబంధిత ఈమెయిల్ ఐడి రిజిస్టర్ నెంబర్ సెండ్ చేయబడుతుంది.
9. తదుపరి Login పై క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ ల తో లాగిన్ అవ్వండి.
10. దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది సంబంధిత అర్హత, వ్యక్తిగత, అనుభవం మొదలగు వివరాలను నమోదు చేస్తూ, దరఖాస్తు ను విజయవంతం చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2022.
అధికారిక వెబ్సైట్: https://cpri.res.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఈనే దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: https://meta-secure.com/CPRI-0222/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment