National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తు 2022-23 నోటిఫికేషన్ వచ్చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 31 2022 వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి ఒక ప్రకటనలో తెలిపింది.
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2022:
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు రాత పరీక్ష ఆధారంగా మెరిట్ స్కాలర్ షిప్ అందించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ మరియు నిర్దిష్ట పోటీ పరీక్షలో కనపరిచిన మెరిట్ ఆధారంగా ఎంపికలు నిర్వహించి, విద్య మద్దతుగా సంవత్సరానికి రూ.12,000/-స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.. ఈ పరీక్షల ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం 1,00,000 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేస్తారు.
అర్హత ప్రమాణాలు:
◆ విద్యార్థినీ విద్యార్థులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.
◆ ఈ స్కీమ్ ద్వారా స్కాలర్షిప్ పొందడానికి VII లేదా VIII విద్యార్థులు హైస్కూల్ స్థాయి చదువులు చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
◆ విద్యార్థిని విద్యార్థులు గత సంవత్సరంలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
షెడ్యూల్ తెగల అభ్యర్థులకు ఐదు శాతం సడలింపు వర్తిస్తుంది.
◆ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.1,50,000/-వేలకు మించకూడదు.
నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే టప్పుడు ఈ క్రింది ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి:
◆ దరఖాస్తుదారు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో,
◆ సంతకం,
◆ ఆధార్ కార్డు నెంబర్,
◆ కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ ముందు సంవత్సరం తరగతి యొక్క మార్క్ షీట్,
◆ రేషన్ కార్డ్,
◆ అంగవైకల్యం సర్టిఫికెట్, వర్తిస్తే మాత్రమే,
◆ విద్యార్థి అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ.. మొదలగునవి.
నేషనల్ స్కాలర్షిప్ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా విద్యార్థిని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scholarships.gov.in/
◆ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ Home పేజీలోని క్రింద కనిపిస్తున్న Applicant Cerner విభాగంలోని లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించవచ్చు.
◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న వారు Renewal Application లింక్ ద్వారా.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు Fresh Application లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించండి.







NMMS పరీక్ష విధానం కోసం :: ఇక్కకడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ :: 31.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://scholarships.gov.in/
తెలంగాణ NMMS స్కాలర్షిప్ వెబ్సైట్ :: https://bse.telangana.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment