ITI Admissions 2022 | TSRTC వాక్-ఇన్-అడ్మిషన్స్-2022 ద్వారా ఐటిఐ ప్రవేశాలు కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు చేయండిలా..
8వ తరగతి, 10వ తరగతి పాస్ తో ఐటిఐ చేయాలనుకునే అభ్యర్థులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త చెప్పింది!. ఇప్పటివరకు జరిగిన ఐటిఐ ప్రవేశాలలో సీటు పొందని అభ్యర్థులకు ఇది గొప్ప వరం. వారు నేరుగా ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై సీట్లను(ప్రవేశాలను) పొందవచ్చు.
తప్పక చదవండి :: Govt Jobs 2022 | పదోతరగతి, డిగ్రీ మరియు పీజీ అర్హతతో అణుశక్తి విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
2022-23 విద్యా సంవత్సరానికి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ITI ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. TSRTC ఆధ్వర్యంలో నిర్వహించే వరంగల్ ఐటిఐ నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్ మరియు వెల్డర్ ట్రేడ్ల యందు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అధికారిక ఐటిఐ పోర్టల్ http://iti.telangana.gov.in/ ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 03, 2022 ఉదయం 10:00 గంటల వరకు అవకాశం ఉన్నది. దరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా స్వంత ఫోన్ నెంబర్ మరియు ఈ-మెయిల్ ఐడి లను కలిగి ఉండాలని ప్రకటనలో సూచించారు. పాస్వర్డ్ సైజ్ ఫోటో మరియు SSC మేమో, TC, 1-10 వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో నేరుగా వరంగల్ ములుగు రోడ్ లోని RTC శిక్షణ కళాశాల యందు సంప్రదించవచ్చు..
తప్పక చదవండి :: 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 127.
ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు:
◆ డీజిల్ మెకానిక్ - 45,
◆ మోటార్ మెకానిక్ - 24,
◆ పెయింటర్ - 20,
◆ వెల్డర్ - 38.. మొదలగునవి.
శిక్షణ కాలం:
● డీజిల్ మెకానిక్ & వెల్డర్ లకు 1సంవత్సరం.
● మోటర్ మెకానిక్ పెయింటర్ లకు 2సంవత్సరాలు.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
ఎంపిక విధానం:
వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ, సమయం:
నవంబర్ 03, 2022 ఉదయం 10:00 గంటల లోపు..
వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ, సమయం:
నవంబర్ 07, 2022 ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే.
అధికారిక వెబ్సైట్: http://iti.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: http://iti.telangana.gov.in/
◆ అధికారిక TS ITI ADMISSIONS 2022 హోమ్ పేజీలోని APPLICANT-CLICK HERE TO APPLY బటన్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నవారు, నేరుగా సైన్ ఇన్ అయి.. దరఖాస్తులను సమర్పించండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
ఇప్పుడే నేరుగా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment