SSC GD Constable 24369 Vacancies Recruitment 2022 | 10th Pass may Apply Online | Check more details here..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 24369 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 2023లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24369.
తప్పక చదవండి :: Indian Post Office Recruitment 2022 | టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 10497,
◆ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 100,
◆ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 8911,
◆సశాస్త్ర సీమా బల్ (SSB) - 1284,
◆ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 1613,
◆ అస్సాం రిఫ్లెష్ (AR) - 1697,
◆ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 103,
◆ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) - 164.
భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు (లేదా) యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ (లేదా) 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
◆ నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
◆ NCC 'A', 'B', 'C' సర్టిఫికెట్లు కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి.
వయోపరిమితి:
◆ జనవరి 1 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
● ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
● ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
● మాజీ - సైనికు లకు 3 సంవత్సరాలు,
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, శారీర దారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ అందరికీ రూ.100/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
◆ దేశవ్యాప్తంగా 9 రీజియన్లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సౌత్ర్న్ రీజియన్ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, మరియు తెలంగాణ) లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
★ ఆంధ్రప్రదేశ్ లో
1. చీరాల,
2. గుంటూరు,
3. కాకినాడ,
4. కర్నూల్,
5. నెల్లూరు,
6. రాజమండ్రి,
7. తిరుపతి,
8. విజయనగరం,
9. విజయవాడ,
10. విశాఖపట్నం..
★ తెలంగాణ లో
1. హైదరాబాద్,
2. కరీంనగర్,
3. వరంగల్..
పరీక్ష అంశాలు, విధానం:
◆ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
● పరీక్ష పేపర్ పార్ట్-ఏ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి 4 విభాగాలుగా ఉంటుంది.
● ప్రతి పార్ట్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
● ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
● పార్ట్-ఎ లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు,
● పార్ట్-బి లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
● పార్ట్-సి లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు,
● పార్ట్-డీ లో ఇంగ్లీష్/ హిందీ నుండి 20 ప్రశ్నలు.
★ 10వ తరగతి సిలబస్ స్టాండర్డ్ ను అనుసరించి పై విషయాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
★ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్క్ కోత విధిస్తారు.
◆ పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
◆ పరీక్ష సమయం 60 నిమిషాలు.







అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30.11.2022.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 01.12.2022.
రాత పరీక్ష నిర్వహించి తేదీ : జనవరి 2023.
ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment