V TG CET 2025 | 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేయండి | th Class Admission
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ (643)సంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు మరియు 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న (ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష) CET - 2025 నోటిఫికేషన్ విడుదలైనది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS & TREIS) విద్యా-సంస్థల్లో 5వ తరగతి మరియు 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా-సంవత్సరంలో 4వ తరగతి మరియు 5వ, 6వ, 7వ, 8వ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, 23.02.2025 న ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. ఫిబ్రవరి 23, 2024 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ముందస్తుగా విద్యార్థులకు తెలియపరచడానికి, పరీక్ష తేదీన ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21.12.2024 నుండిFollow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:- 2024-25 విద్యా-సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అర్హులు.
- 4వ తరగతి చదువుతున్నట్లు గా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్ మరియు మీ ఫోటో, సంతకం ను అప్లోడ్ చేయాలి.
- 6వ, 7వ, 8వ, 9వ తరగతిలో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ సంవత్సరంలో ముందు తరగతి (5వ, 6వ, 7వ, 8వ) చదువుతూ ఉండాలి.
వయసు:
- విద్యార్థిని విద్యార్థులు వయస్సు ఈ దిగువ పేర్కొన్న ప్రకారం ఉండాలి.
- ఓసి, బిసి వర్గాలకు చెందిన వారికి 09 నుండి 11 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి 09 నుండి 13 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ/ బిసి-సి వర్గాలకు చెందిన వారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులు.
ఆదాయ వివరాలు:
- దరఖాస్తు చేసుకునే విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం..
- రూరల్ ప్రాంతాల వారికి రూ.1,50,000/-,
- అర్బన్ ప్రాంతాలవారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- విద్యార్థుల ఎంపికకు "పాత జిల్లా" ఒక యూనిట్ గా పరిగణింపబడతారు.
- ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, గణితం, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) & పరిసరాల విజ్ఞానం 3, 4వ తరగతి స్థాయిలో ఉంటుంది.
- రాత పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో OMR జవాబు పత్రంపై సమాధానాలు గుర్తించేలా నిర్వహించబడుతుంది.
రాత పరీక్షలో ఈ కింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- తెలుగు నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- గణితం నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- పరిసరాల విజ్ఞానం నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం) నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు..
- ఇలా మొత్తం 100 మార్పులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.12.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 01.02.2025 న ముగుసినది దానిని 06.02.2025 వరకు పొడిగించారు.
ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ :: 23.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment