TS EAMCET 2022 Slot Booking Full Live Process by elearningbadi.in | తెలంగాణ ఎంసెట్ 2022 స్లాట్ బుకింగ్ పూర్తి సమాచారం.
తెలంగాణ ఎంసెట్ 2022 అహ సాధించిన విద్యార్థులకు స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం లైవ్ వీడియో తో ఇక్కడ అందించడం జరిగింది. మొదటి రోజే 16,428 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీ నుండి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమవుతుంది, హెల్ప్లైన్ కేంద్రాలు, కోర్సుల వివరాలు, నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్, ఫైనల్ ఫేస్, స్పాట్ అడ్మిషన్ తో కూడిన వివరణాత్మక సమాచారం మీకోసం.
TS EAMCET 2022 Slot Booking ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం ఎలా?.
TS EAMCET 2022 Slot Booking Live Demo కోసం ఈ క్రింది వీడియో చూడండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tseamcet.nic.in/
◆ స్లాట్ బుకింగ్ కోసం ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
◆ ప్రాసెసింగ్ పి జనరల్ అభ్యర్థులకు రూ.1200/- రిజర్వేషన్ వర్గాలవారికి రూ.600/-.
◆ ఫీజు చెల్లించడానికి మెయిన్ మెనూ లోని Pay Processing Fee లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఫీజు పే చేయడానికి సంబంధించిన అధికారిక పేజీ ఓపెన్ అవుతుంది, ఫీ పే చేయడానికి ఈ క్రింది సమాచారం ముందుగా దగ్గర ఉంచుకోండి.
First Phase ముఖ్య తేదీలు:
ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం :: 21.08.2022 నుండి 29.08.2022 వరకు.
స్లాట్ బుకింగ్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం :: 23.08.2022 నుండి 30.08.2022.
ఫ్రీజింగ్ తేదీ :: 02.09.2022.
ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ వివరాలు :: 06.09.2022.
ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ లో చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయు తేదీ :: 06.09.2022 నుండి 13.09.2022 వరకు.
★ ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి ముఖ్య సమాచారం :
● తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ :
● ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ :
● పుట్టిన తేదీ :
● ఆధార్ నెంబర్ :
● కుల ధృవీకరణ సర్టిఫికేట్ :
● ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ :
● మొబైల్ నెంబర్ :
● ఈమెయిల్ ఐడి :
◆ తదుపరి సంబంధిత వివరాలను నమోదు చేస్తూ, వెరిఫికేషన్ కోడ్ నమోదుచేసి Pay Fee Online బటన్ పై క్లిక్ చేయండి.
◆ మీ వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.
◆ ఇక్కడ కుల, ఆదాయ, ఆధార్, మొబైల్ నెంబర్లు మరియు ఈమెయిల్ ఐడి లను నమోదుచేసి, డిక్లరేషన్ చెక్ బాక్స్ పై (టిక్) చేసి Submit బటన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కుల ధ్రువీకరణ పత్రం వివరాలు(Not Available), ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలు కనిపిస్తాయి, పి పే చేయడానికి పేమెంట్ ఆప్షన్ క్రింద కనిపిస్తున్న, చెక్ బాక్స్ పై (టిక్) చేసి (పేమెంట్ ఆప్షన్ లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా, Pay Fee Online బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఆన్లైన్ ఫీజు చెల్లించడం కోసం కొత్త పేజీ లోకి డైరెక్టర్ అవుతారు.
◆ సంబంధిత వివరాలను నమోదు చేస్తూ, Make Payment లింక్ పై క్లిక్ చేయండి.
TS EAMCET 2022 Slot Booking Live Demo కోసం పైన ఉన్న వీడియో చూడండి.
◆ సంబంధిత మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది, నమోదు చేసి పై విజయవంతం చేయండి.
◆ ఫీ పే విజయవంతం అవగానే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అక్కడే క్రింద కనిపిస్తుంది , దానిపై క్లిక్ చేసి లేదా హోం పేజీలోని Slot Booking ఆప్షన్ పై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేయవచ్చు.
◆ స్లాట్ బుకింగ్ లో భాగంగా మరల, హాల్టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేది వివరాలు నమోదు చేస్తూ.. వెరిఫికేషన్ కోడ్ నమోదుచేసి Show Available Slot బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి డైరెక్ట్ అవుతారు.
◆ ఇక్కడ ముందుగా విద్యార్థి క్యాటగిరి నమోదు చేయాలి.
◆ OC/ SC/ BC/ ST వారు All ఎంపిక చేయండి.
◆ మిగిలిన వారు సంబంధిత ఆప్షన్ను ఎంపిక చేయండి.
★ OC/ SC/ BC/ ST వీరికి సంబంధిత జిల్లా కేంద్రాల్లో.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
★ స్పోర్ట్ ఎన్సిసి దివ్యాంగులు ఆంగ్లో-ఇండియన్ సైనికుల పిల్లల వంటి ప్రత్యేక హోదా అభ్యర్థులకు హైదరాబాద్లోనే మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలు(సంబంధిత అధికారులు) మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
◆ తదుపరి హెల్ప్ లైన్ సెంటర్ ను ఎంపిక చేయడానికి, డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి, దగ్గరలో అందుబాటులో ఉన్న కాలేజ్ ఎంపిక చేయండి, అన్ని జిల్లాల వారికి Help Line సెంటర్ లు అందుబాటులో ఉన్నాయి.
◆ కాలేజ్ ఎంపిక చేయగానే ఈనెల 23వ తేదీ నుండి, 28వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు అందుబాటులోకి వస్తాయి. అవకాశాన్ని బట్టి సంబంధిత తేదీన ఎంపిక చేయండి.
◆ సంబంధిత తేదీలు ఎన్నుకో గానే క్రింద సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయి, అక్కడి నుండి (సంబంధితటైం) ఎంపిక చేయండి.
◆ తదుపరి మీకు కాలేజ్ వివరాలతో కూడిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ సమయం కనిపిస్తాయి.
◆ స్లాట్ బుకింగ్ వివరాలను లాక్ చేయడానికి Yes పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత పేజీ ప్రివ్యూ షో అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.







తదుపరి సంబంధిత వివరాలు త్వరలో మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. అవి;
◆ కాలేజ్ కోడ్ వివరాలు..
◆ జిల్లా కోడ్ వివరాలు..
◆ కాలేజ్ ప్రిఫరెన్స్ ఎన్రోల్మెంట్.
◆ కౌన్సిలింగ్ ఫీ పే చేయడం.
◆ సీట్ అలాట్మెంట్ వివరాలను తనిఖీ చేయడం.
◆ సంబంధిత కాలేజ్ లో రిపోర్ట్ చేయడం. మొదలగు అన్ని వివరాలు.
అధికారిక వెబ్సైట్ :: https://tseamcet.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాం పిడిఎఫ్ :: డౌన్లోడ్ చేయండి.
TS EAMCET 2022 helpline సెంటర్ కాలేజ్ వివరాల పిడిఎఫ్ :: డౌన్లోడ్ చేయండి.
విద్య ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా పొందడానికి మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment