తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC Inter AY 2022-23 ప్రత్యేక ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
చదువుకోవాలనే ఆశ వుండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, విద్యా సంవత్సరం 2022-23 కు గాను, SSC, Inter ప్రత్యేక ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రత్యేక ప్రవేశాలు 12.09.2022 నుండి 24.09.2022 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత అవకాశాలను అందుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ పేజీలో అందించడం జరిగింది.
తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం, చదువు మధ్యలో మానేసిన వయోజనులకు గృహిణులకు మరియు ఎనిమిదవ తరగతి అర్హతతో ఉద్యోగం పొందిన వారికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ ప్రవేశం పొంది పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువులను ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేయవచ్చు. రెగ్యులర్ అకడమిక్ విద్యార్హతతో సమానంగా పరిగణించబడతాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్ లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తగు సమాచారాన్ని తెలుసుకోవచ్చు తద్వారా ప్రవేశాలను పొంది ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా క్రెడిట్ అవకాశాలను తీసుకొచ్చింది. గతంలో పదవ తరగతి 12 సబ్జెక్టులో ఫెయిల్ ఐ అలాగే ఉండి పోయిన అభ్యర్థులు, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న టువంటి SSC, Intermediate కోర్సులో జాయిన్ అయినా మిగిలిన సబ్జెక్టులను ఇక్కడ వారికి అనుగుణంగా ఫీజు కట్టుకొని పాస్ కావచ్చు. రెగ్యులర్ అకడమిక్ క్రెడిట్ అందుతుంది.







SSC Inter లో వారికి నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకుని పరీక్షలు రాసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.telanganaopenschool.org/
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న SSC, Inter ప్రవేశాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లోని News and Media ఈ విభాగంలో కింద కనిపిస్తున్న SSC & Intermediate (TOSS) Admission for the year 2022-23 లింక్ పై క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment