NMDC Recruitment - 2023 | డిగ్రీతో 42 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
డిగ్రీతో 42 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు |
గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ పీజీ/ డిప్లమా/ MBA అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.01.2023 నుండి, 17.02.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18 నెలల శిక్షణా కాలంలో రూ.37,000/-, శిక్షణ అనంతరం స్కేల్ ఆఫ్ పే రూ.37,000/- నుండి రూ.1,30,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 42.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ - 11,
2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్ & పర్చేస్) ట్రైనీ - 16,
3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ - 15..మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో గ్రాండ్యువేషన్/ డిగ్రీ/ డిప్లొమా/ పీజీ/ ఇంజనీరింగ్ డిగ్రీ.. ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
✓ డిపార్ట్మెంట్ అభ్యర్థులు కనీసం ఒక(1) సంవత్సరం అనుభవం అవసరం.
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులకు 32 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 - 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో రూ.37,000/- ప్రతి నెల, శిక్షణ అనంతరం బేసిక్ పే రూ.37,000/- నుండి రూ.1,30,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.250/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ NMDC డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.01.2023 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nmdc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ఆసక్తి కలిగిన భారతీయ యువత ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.nmdc.co.in/
◆ అధికారిక NMDC Home పేజీలోని 3 గీతలపై క్లిక్ చేసి, Careers ఆప్షన్ను ఎంపిక చేయండి.
◆ తదుపరి పేజీని స్క్రోల్ ఆఫ్ చేసి, Click here for Apply Online పై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ ఉండే పేజీలోకి రీ డైరెక్టు అవుతారు.
◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, వారి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ ఫ్రెషర్స్ అభ్యర్థులు, ముందుగా వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి.. తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించాలి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే డైరెక్ట్ గా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment