PJTSAU - Walk-in-Interview for Teaching Staff 2023 | పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి 24న ఇంటర్వ్యూలు | Check Eligibility here..
![]() |
పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి 24న ఇంటర్వ్యూలు |
మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఖాళీల భర్తీకి 24.01.2023 న ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి క్లాస్ కు రూ.1000/- & నెలకు రూ.35,000/-వేల రూపాయల చొప్పున జీతం గా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, లేదా దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు..
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
✓ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ & మ్యాథమెటిక్స్ - 02,
✓ ప్లాంట్ బయోకెమిస్ట్రీ - 01,
✓ లైవ్ స్టాక్, పౌలరీ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించి M.Sc, M.V.Sc, Ph.D అర్హతలను సంబంధిత సబ్జెక్టులో కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
✓ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ కాలేజ్, పాలెం నాగర్ కర్నూల్ డిస్టిక్-509215.
✓ 24.01.2023.
✓ ఉదయం 11:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.pjtsau.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment