పదవ తరగతి తో 26,146 కానిస్టేబుల్ ఉద్యోగాలు | ప్రాంతీయ భాషలో పరీక్ష | దరఖాస్తు లింక్ ఇదే SSB GD Constable Open Recruitment Examination 2024..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
- 10వ తరగతి అర్హతతో 26,146 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
- భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
- ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 26,146 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 24.11.2023 నుండి 31.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి/ మార్చ్ 2024లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 26,146.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 6174,
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 11025,
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 3337,
- సశాస్త్ర సీమా బల్ (SSB) - 635,
- ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 3189,
- అస్సాం రిఫ్లెష్ (AR) - 1490,
- సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 296,
- నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) - 0,
- ఇలా మొత్తం 26,146 పోస్టులను భర్తీకి ప్రకటించింది.
భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు (లేదా) యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ (లేదా) 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
NCC 'A', 'B', 'C' సర్టిఫికెట్లు కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి.
- NCC - C సర్టిఫికెట్ కలిగిన వారికి 5 శాతం మార్పులు,
- NCC B సర్టిఫికెట్ కలిగిన వారికి 3 శాతం మార్పులు,
- NCC A సర్టిఫికెట్ కలిగిన వారికి 2 శాతం మార్పులు బోనస్ గా ఇవ్వబడతాయి.
వయోపరిమితి:
- 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
- మాజీ - సైనికు లకు 3 సంవత్సరాలు,
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, శారీర దారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా 9 రీజియన్లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సౌత్ర్న్ రీజియన్ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, మరియు తెలంగాణ) లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
ఆంధ్రప్రదేశ్ లో
- చీరాల,
- గుంటూరు,
- కాకినాడ,
- కర్నూల్,
- నెల్లూరు,
- రాజమండ్రి,
- తిరుపతి,
- విజయనగరం,
- విజయవాడ,
- విశాఖపట్నం..
తెలంగాణ లో
- హైదరాబాద్,
- కరీంనగర్,
- వరంగల్..
పరీక్ష అంశాలు, విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష పేపర్ పార్ట్-ఏ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి 4 విభాగాలుగా ఉంటుంది.
- ప్రతి పార్ట్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
- పార్ట్-ఎ లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-బి లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-సి లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు,
- పార్ట్-డీ లో ఇంగ్లీష్/ హిందీ నుండి 20 ప్రశ్నలు.
- 10వ తరగతి సిలబస్ స్టాండర్డ్ ను అనుసరించి పై విషయాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
- ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్క్ కోత విధిస్తారు.
- పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ తో పాటు 13 రీజనల్ ప్రాంతీయ మాధ్యమాల్లో ఉంటుంది. అవి;
- అస్సామీ,
- బెంగాలీ,
- గుజరాతి,
- కన్నడ,
- కొంకణి,
- మలయాళం,
- మణిపూరి,
- మరాఠీ,
- ఒడియా,
- పంజాబీ,
- తమిళ్,
- తెలుగు మరియు
- ఉర్దూ..
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి రూ.69,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- అందరికీ రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31.12.2023.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 01.01.2024.
రాత పరీక్ష నిర్వహించి తేదీ : ఫిబ్రవరి/ మర్చి 2024.
ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment