TSMSC Free Coaching - 2022 | ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు తెలంగాణ స్టడీ సర్కిల్ దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంది.. తాజాగా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ లను అందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మైనారిటీ కమ్యూనిటీ ల (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ) కు చెందిన జనరల్ ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 22, 2022 (సోమవారం) నుండి ప్రారంభమైంది. సెప్టెంబర్ 1, 2022 (గురువారం) తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, వ్యక్తిగత సంబంధిత అర్హత ధ్రువపత్రాలను నమోదు చేస్తూ రిజిస్టర్ అవ్వండి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ముఖ్య సమాచారం మీకోసం..
Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
TSMSC CSAT - 2023 అర్హత ప్రమాణాలు:
◆ తెలంగాణ మైనారిటీ కమ్యూనిటీ ల (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ) కు చెందిన అభ్యర్థులు వుండాలి.
◆ జనరల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైనా విభాగంలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/-మించకుండా ఉండాలి.
◆ అభ్యర్థులు ఇప్పటికే ఈ శిక్షణను పొంది ఉండకూడదు.
ఎంపిక విధానం:
◆ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ ఈ స్క్రీనింగ్ పరీక్ష ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది.
◆ నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
★ స్క్రీనింగ్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి తుది ఎంపిక చేపడతారు.
Job Alert 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్)ఉద్యోగాలు | పూర్తి వివరాలు..
స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించు తేదీ, సమయం :: 11.09.2022, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
ఫలితాలు విడుదల చేయు తేదీ :: 17.09.2022.
పరీక్ష సెంటర్ల వివరాలు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.09.2022.







అధికారిక వెబ్సైట్ :: https://cet.cgg.gov.in/tmreis/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment