CRPF Recruitment 2023 | 10+2, డిగ్రీ, డిప్లమా తో 1498 ఉద్యోగాల భర్తీ | Check Details here..
![]() |
10+2, డిగ్రీ, డిప్లమా తో 1498 ఉద్యోగాల భర్తీ |
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), 10+2, డిగ్రీ, డిప్లమా తో 1498 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
✓ ఇందులో 1458 శాశ్వత ఉద్యోగాలు, అవి;
• ASI (STENO) - 143,
• హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) - 1315.
📌 నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
✓ ఒప్పంద ప్రాతిపదికన 40 స్పెషలిస్ట్ మెడికల్ సిబ్బంది, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన..
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కొరకు రాత పరీక్ష లేకుండా పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ ఆఫ్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ ఆసుపత్రు లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన మహిళ, పురుష అభ్యర్థులు విధులు నిర్వర్తించడానికి నేరుగా ఆయా తేదీల్లో ఇంటర్వ్యూల లో పాల్గొనవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 40.
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పని విభాగాలు :
రేడియాలజీ, అనస్తీషియా, మెడిసిన్, Obs & Gynac, సర్జన్ మొదలగునవి.
విద్యార్హత :
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తో పాటు సంబంధిత స్పెషలిస్ట్ లో పోస్ట్ గ్రాడ్యువేట్ డిగ్రీ లేదా డిప్లమా పేజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు :
దరఖాస్తు చివరి తేదీ నాటికి 67 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.85,000/-జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 23-01-2023 ఉదయం 09:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ వేదికలు :
✓ సి.ఆర్.పి.ఎఫ్ కాంపోజిట్ హాస్పిటల్ హైదరాబాద్, రాంపూర్, ఢిల్లీ, అజ్మీర్, రాంచీ, బిలాస్పూర్, జగదల్పూర్, నాగపూర్, పూణే, ఇంపాల్, జమ్ము మొదలగు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం ::
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే లేదా ఇక్కడ నుండి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు..
✓ దరఖాస్తు ఫారంతో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు, ఇటీవల ఫోటో, సంతకం, అనుభవం కాపీలను జత చేయాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ /దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment