IRCON Recruitment 2023 | ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Hurry Up! Registration Closed Soon..
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, తేదీ, వేదిక వివరాలు..
![]() |
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు |
భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ , దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయస్సు, విద్యార్హతలు, మొదలగు ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :32
విభాగాల వారీగా ఖాళీలు :
1 జేజిఎం/ ఎలక్ట్రికల్ - 05,
2. డీజీఎం/ ఎలక్ట్రికల్ - 10,
3. మేనేజర్/ ఎలక్ట్రికల్ - 05,
4. మేనేజర్/ ఓహెచ్ఈ - 03,
5. మేనేజర్/ ఎన్& టి - 02,
6. వర్క్స్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ - 02,
7. సీనియర్ సైట్ సూపర్వైజర్/ ఎలక్ట్రికల్ - 02,
8. సైట్ సూపర్వైజర్/ ఎలక్ట్రికల్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగాలలో ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
✓ సంబంధిత పోస్టులలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
31-12-2023 నాటికి 30-50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన మార్కులతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
పోస్టులను అనుసరించి రూ.25.000/- నుండి రూ.80.000/- వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్లో విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
ఇంటర్వ్యూ తేదీలు :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ తో.. సంభందిత అర్హత దృవపత్రాలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న సెంటర్ లలో 30.01.2023 నుండి, 08.02.2023 వరకు పాల్గొనవచ్చు..
సమయం : ఉదయం 09:00 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://www.ircon.org/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment