తెలంగాణ ఏకలవ్య మోడల్ పాఠశాల లో టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు | EMRS Teaching Non-teaching Vacancies Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ (TSES), కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాంపల్లి హైదరాబాద్-500001. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్, (EMRS) పాఠశాలలో విద్యా సంవత్సరం 2023-24 గానూ VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 21.06.2023 నుండి సమర్పించవచ్చు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో సబ్జెక్టులు;
- ఇంగ్లీష్,
 - హిందీ,
 - గణితం,
 - ఫిజిక్స్,
 - కెమిస్ట్రీ,
 - బయాలజీ,
 - హిస్టరీ,
 - జియోగ్రఫీ,
 - ఆఫ్ కామర్స్,
 - ఎకనామిక్స్,
 - తెలుగు,
 - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. మొదలగునవి.
 
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఈ విభాగంలో సబ్జెక్టులు;
- ఇంగ్లీష్,
 - హిందీ,
 - తెలుగు,
 - గణితం,
 - సైన్స్,
 - సోషల్,
 - స్టడీస్,
 - లైబ్రేరియన్.. మొదలగునవి.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్/ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్/ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత కలిగి ఉండాలి.
 
- పోస్టుల వారీగా విద్య అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 - నోటిఫికేషన్ లింక్ చివర్లో పిన్ చేయబడింది.
 
వయోపరిమితి:
- 01.07.2023 నాటికీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 
ఎంపిక విధానం:
- అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలో కనపరిచిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా & డెమో ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
 
- సంబంధిత విద్యార్హత కు - 40 మార్కులు,
 - బీఈడీ అర్హతకు - 10 మార్పులు,
 - తదుపరి అత్యున్నత విద్యార్హత (Ph.D/ M.Phil/ M.Ed) కు - 10 మార్కుల,
 - అనుభవానికి - 15 మార్కులు,
 - డెమో కు - 25 మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఆధారంగా ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా ఎంపికలు చేపడతారు.
 
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న విధంగా పోస్టు లను బట్టి గౌరవ వేతనం ప్రతినెలా చెల్లిస్తారు.
 
- PGTs లకు - రూ.35,750/-.
 - TGTs లకు - రూ.34,125/-.
 - లైబ్రేరియన్ లకు - రూ.30,000/-.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
 
తెలంగాణలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలల వివరాలు:
- అదిలాబాద్ - EMRS నార్నూర్
 - అదిలాబాద్ - EMRS ఉట్నూర్
 - అదిలాబాద్ - EMRS ఇంద్రవెల్లి
 - కామారెడ్డి - EMRS గాంధారి
 - కొమరం భీమ్ ఆసిఫాబాద్ - EMRS సిర్పూర్
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS టేకులపల్లి
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS పాల్వంచ
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS ములకలపల్లి
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS గండు గుల్లపల్లి
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS గుండాల
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS చర్ల
 - కొత్తగూడెం భద్రాద్రి - EMRS దుమ్ముగూడెం
 - ఖమ్మం - EMRS సింగరేణి
 - నాగర్ కర్నూల్ - ENRS కల్వకుర్తి
 - మహబూబ్నగర్ - EMRS బాలానగర్
 - మహబూబాబాద్ - EMRS బయ్యారం
 - మహబూబాబాద్ - EMRS కురవి
 - మహబూబాబాద్ - EMRS సిరోల్
 - మహబూబాబాద్ - EMRS కొత్తగూడ
 - మహబూబాబాద్ - EMRS గూడూర్
 - రాజన్న సిరిసిల్ల - EMRS ఎల్లారెడ్డిపేట
 - రాజన్న సిరిసిల్ల - EMRS మర్రిమడ్ల
 - నిజామాబాద్ - EMRS ఇందల్ వాయి
 
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) వెబ్ సైట్ ను సందర్శించండి.
 - తదుపరి అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
 - పక్కనే కనిపిస్తున్న, దరఖాస్తు ఫీజు సమర్పించడానికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
 - తదుపరి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
 - భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
 
అధికారిక వెబ్సైట్ :: http://emrs-23adm.iyuga.co.in/ & https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment