తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..
TGRJC CET 2025: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం.
మార్చ్-2024 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు శుభవార్త!.
తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం (MPC/ BPC/ MEC) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
TSRJC CET - 2025 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కొరకు టీ.ఎస్.ఆర్.జె.సి - సెట్ 2025 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో; అనగా.. మార్చి 2025 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణలోని అన్ని (33) జిల్లాల విద్యార్థిని, విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 24.03.2025 నుండి 23.04.2025 వరకు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపర్చిన అభ్యర్థులకు రిజర్వేషన్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉన్నాయి. అవి;
- జనరల్ బాయ్స్ - 15,
- జనరల్ గర్ల్స్ - 20.
- తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు క్రింద చూపబడిన అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి. అవి;
- ప్రయోగశాలలు, లైబ్రరీలు, రీడింగ్ రూమ్ మరియు చక్కటి భౌతిక వసతులతో ఆట మైదానాలు.
- ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత బోర్డింగ్ మరియు వసతి తో ఉచిత విద్యను అందిస్తారు.
- ఎంపికైన విద్యార్థులకు పై సౌకర్యాలు అందించబడతాయి.
- ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
- NET, JEE-MAINS, Advanced కోర్సులకు శిక్షణలు ఇస్తారు.
అర్హత ప్రమాణాలు :
- విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
- మార్చ్-2025 లో 10వ తరగతి పరీక్షలో మొదటి అటెంప్ట్ లో అర్హత సాధించగలగాలి.
- OC విద్యార్థులు కనీసం 6 GPA,
- BC/ SC/ ST విద్యార్థులు కనీసం 5 GPA,
- English సబ్జెక్టులో కనీసం 4 GPA తో ఉత్తీర్ణత సాధించగలగాలి.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 జిల్లా హెడ్ క్వార్టర్లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
- ఆదిలాబాద్,
- వరంగల్,
- కరీంనగర్,
- ఖమ్మం,
- నిజామాబాద్,
- నలగొండ,
- మహబూబ్నగర్,
- హైదరాబాద్,
- రంగారెడ్డి,
- సంగారెడ్డి,
- సిద్దిపేట,
- మెదక్.. మొదలగునవి.
(అభ్యర్థులు ఏదైనా పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయవచ్చు).
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు:
- ప్రశ్న పత్రం తెలుగు ఇంగ్లీష్ మద్యమాల్లో ఉంటుంది.
- పరీక్ష సమయం (2.5) రెండున్నర గంటలు.
- మల్టిపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పదవ తరగతి, తెలంగాణ రాష్ట్ర సిలబస్ అనుగుణంగా ప్రశ్నలు అడుగుతారు.
- సమాధానాలను ఓఎంఆర్ షీట్ పై పెన్ తో బబ్లింగ్ చేయాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత (ప్రవేశ) పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా ముందుగా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది. తదుపరి, అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ అలాట్మెంట్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.03.2025,
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ :: 23.04.2025.
ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ :: 10.05.2025 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment