Admissions 2022 | ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్)-2022 | ప్రవేశ కోర్సుల వివరాలు..!
Admissions 2022 | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 16 యూనివర్సిటీలలో పరిశోధన కోర్స్ చేయుటకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | ప్రవేశ కోర్సుల వివరాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని 16 విశ్వవిద్యాలయలలో 2022-23 అకడమిక్ సంవత్సరానికి గాను పరిశోధన కోర్సులలో చేరాలనుకునే యువత కోసం ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్ సెట్)-2022 ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇందుకు గాను జనరల్ కేటగిరికి సంబంధించిన అభ్యర్థులు 55%, రిజర్వేషన్ కేటగిరికి సంబంధించిన అభ్యర్థులకు 50% మార్కులతో సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కుడా అర్హులే. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకు ను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 యూనివర్సిటీలలో ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశ దరఖాస్తులకు చివరి రోజు సెప్టెంబర్ 24 2022, ఆసక్తి ఉండి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరిక ఉన్నా విద్యార్థులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఏమైనా సందేహాలుంటే అధికారక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ ప్రవేశాల నోటిఫికేషన్ యొక్క సమాచారం అయినా విద్యాఅర్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపికలు, విభాగాలు, మరియు ముఖ్యమైన తేదీలు మీకోసం.
TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..
విద్యార్హతలు:
మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, ఇంజినీరింగ్, ఫార్మసీ) తదితర కోర్సులలో 55శాతం మార్కులు , ఎస్సి, ఎస్టీ, బీసీ మరియు ఇతర రిజర్వేషన్ వున్న విద్యార్థులకు 50శాతం మర్కులతో ఉత్తీర్ణులై ఉండాలి,
పీజీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.
విద్యా విభాగం:
సైన్స్, ఆర్ట్స్,కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, హ్యూమనటిస్, ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ తదితరులు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభమైనాయి.
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 24 2022.
దరఖాస్తు ఫీజు:
సబ్జెక్టు జనరల్ అభ్యర్థులకు 1500రూ",
బీసీ అభ్యర్థులకు 1300రూ"
ఎస్సి,ఎస్టీ మరియు దివ్యంగు లకు 1000రూ" ఫీజులను చెల్లించాలి.
పరీక్ష తేదీలు:
16 అక్టోబర్ 2022 నుంచి 19 అక్టోబర్ 2022 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.







ఎంపిక విధానం:
రాత పరీక్ష లో వచ్చిన మార్కులు , ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభను బట్టి ఎంపికలు వుంటాయి.
అదికారిక వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి. డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment