TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..
TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | ఈ నెల 20 నుండి దరఖాస్తులు ప్రారంభం | రాత పరీక్షల ద్వారా ఎంపిక | జీతం రూ.32,810 నుండి రూ.96,890 వరకు | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకు సంబంధించి అసెంబ్లీలో చేసిన ప్రమాణాలను నెరవేరుస్తూ వస్తుంది, ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్, హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ మొదలగు విభాగాల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాలను చేపడుతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే, తాజాగా TSPSC నుండి మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం క్రింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ ఉద్యోగాలకు, విద్యార్హత ప్రమాణాలతో పూర్తి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 20 నుండి ప్రారంభించి వచ్చే నెల 13 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించడం ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. తాజా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవలెనని కి మన వెబ్ సైట్ elearningbadi.in ను సబ్స్క్రైబ్ చేయండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 175.
పోస్ట్ పేరు : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీయర్.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి
◆ బ్యాచిలర్ టెక్నికల్ విభాగంలో D.C.E/ L.C.E/ L.L.A లేదా
◆ బీఈ/ బీటెక్ (సివిల్)/ బి. ప్లానింగ్ లేదా బీటెక్ (ప్లానింగ్)/ బి. ఆర్కిటెక్చర్ మొదలగు విభాగాల్లో డిగ్రీ లేదా
◆ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన అర్హత కలిగినవారై ఉండాలి.
వయోపరిమితి:
జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు, సడలింపులు అవసరం ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు పూర్తిగా చదివండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-
◆ పరీక్ష ఫీజు రూ.80/-
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment