TS Latest JOBs 2022 | జిల్లా ప్రభుత్వ కాలేజీలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ తో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 19.11.2022 నుండి ప్రారంభమై, 25.11.2022 సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన..
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీకి ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.19,500/- ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. వివిధ విభాగాల్లో మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్/ స్టెనో టైపిస్ట్/ స్టెనోగ్రాఫర్/ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10,
2. డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ - 04,
3. ల్యాబ్ అటెండెంట్ - 04,
4. రికార్డ్ అసిస్టెంట్ - 02,
5. థియేటర్ అసిస్టెంట్ - 04.. మొదలగునవి.
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
◆ స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్/ స్టెనో టైపిస్ట్/ స్టెనోగ్రాఫర్/ డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు - ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్తో PGDCA/ బిఎస్సి కంప్యూటర్స్/ బీకాం కంప్యూటర్స్ అర్హత..
◆ డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ లకు - 10వ తరగతి అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి..
◆ ల్యాబ్ అటెండెంట్ లకు - గ్రాడ్యుయేషన్ తో MLT/ DMLT అర్హత కలిగి తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి..
◆ రికార్డ్ అసిస్టెంట్ లకు - మెడికల్ రికార్డ్ విభాగంలో డిప్లమా అర్హతతో అనుభవం అవసరం..
◆ థియేటర్ అసిస్టెంట్ లకు - పదవ తరగతి అర్హతతో.. ప్రధమ చికిత్స ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి..
వయోపరిమితి:
01.07.2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అక్కడ మీకు టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
తప్పక చదవండి :: 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.19,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు..
తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://mahabubabad.telangana.gov.in/
◆ అధికారిక హోమ్ పేజీలో, నోటిఫికేషన్, సంబంధిత ఆన్లైన్ దరఖాస్తు గూగుల్ ఫామ్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి.. అర్హత ప్రమాణాల ఆధారంగా సంబంధిత లింక్ పై క్లిక్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
◆ వ్యక్తిగత, విద్యార్హత, వివరాలు నమోదు చేస్తూ.. అవసరమైన చోట సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి, దరఖాస్తులను సబ్మిట్ చేయండి..







సంబంధిత పోస్టులకు నేరుగా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి:
1. స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్/ స్టెనో టైపిస్ట్/ స్టెనోగ్రాఫర్/ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
2. డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
3. ల్యాబ్ అటెండెంట్ - పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
4. రికార్డ్ అసిస్టెంట్ - పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
5. థియేటర్ అసిస్టెంట్ - పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment