Power Grid 800 Vacancies Recruitment 2022 | B.E/ B.Tech/ B.Sc(Engg) can Apply Online | Check Salary and other Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 800 ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21న మొదలై డిసెంబర్ 12న ముగియనుంది... రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో సూచించారు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 800.
విభాగలవారీగా ఖాళీల వివరాలు:
◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 50,
◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) - 15,
◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఐటి) - 15,
◆ ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) - 480,
◆ ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) - 240.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో ఫుల్ టైం బిఈ/ బిటెక్/ బి.ఎస్సి (ఇంజనీరింగ్)/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగంలో డిప్లమా అర్హత కలిగి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: ప్రభుత్వ పర్మినెంట్ 419 ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాస్ సెంటర్ భారీ నోటిఫికేషన్ విడుదల..
వయోపరిమితి:
11.12.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం:
◆ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్న పత్రం ఉంటుంది.
◆ టెక్నికల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు,
◆ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు. అడుగుతారు
◆ పరీక్ష సమయం: ఒక(1) గంట.
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు..
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.23,000/- నుండి, రూ.1,20,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు రూ.400/-,
◆ ఫీల్డ్ సూపర్వైజర్లకు రూ.300/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.powergrid.in/
◆ అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేసి, Job Opportunities ను ఎంపిక చేసి, Openings పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు Job Opportunities పేజీలోకి రి-డైరెక్ట్ అవుతారు.
◆ ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు Recruitment of FEFS 2022 for RDSS Scheme పేజీ లోకి రీ-డర్ అవుతారు.
◆ ఇక్కడ, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ అందుబాటులో ఉంటాయి, వాటిపై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించవచ్చు..
◆ దరఖాస్తులు సమర్పించడానికి Click here to Apply లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి, ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి సంబంధిత పోస్ట్ ను ఎంపిక చేసుకుని దరఖాస్తు ఫామ్ ని పూర్తి చేసి, దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
డైరెక్ట్ గా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment