JNVST VI Admission Test 2023 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 | Apply Online here..
జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన 2023.
![]() |
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 |
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
విద్యా సంవత్సరం 2022-23 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ లైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష ను 29.04.2023 ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.
తప్పక చదవండి :: TSWR COE CET 2023 | ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | Register here..
ఈ విద్యాలయ సంస్థల్లో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద్యాలయా సంస్థలు విద్యాబోధన అందిస్తున్నాయి.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా 1986లో ఈ విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి జవహర్ విద్యాలయ పాఠశాలలో 6వ తరగతికి 80 సీట్లు ఉంటాయి.
✓ ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% బాలికలకు 33 శాతం సీట్లను కేటాయించారు.
ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధన తో పాటు ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు చదువుతోపాటు శిక్షణలు ఇస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 పూర్తి వివరాలు:
విద్యార్హత:
✓ విద్యార్థిని, విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
✓ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించిన 75 శాతం సీట్లలో సీటు సాధించడానికి.. విద్యార్థిని విద్యార్థులు 3, 4, 5 తరగతుల గ్రామీణప్రాంత విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
తప్పక చదవండి :: TSMS Admission test 2023 | తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Apply Online here..
వయసు:
విద్యార్థిని విద్యార్థులు 2011 మే 31 నుండి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
✓ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ.. మొదలగు భాషలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మాధ్యమాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సిలబస్/ అంశాలు:
✓ ఈ పరీక్ష పెన్, పేపర్ (OMR) విధానంలో నిర్వహిస్తారు.
✓ మొత్తం మూడు విభాగాల్లో కలిపి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు.
• మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 40 ప్రశ్నలు 50 మార్కులకు,
• అర్థమెటిక్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు,
• లాంగ్వేజ్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు..
✓ పరీక్షా సమయం రెండు గంటలు.
పరీక్షా కేంద్రాలు:
దేశవ్యాప్తంగా రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక జిల్లా పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.
✓ ఆధార్ వివరాలు..,
✓ రెసిడెన్స్ సర్టిఫికెట్,
✓ అధికారిక వెబ్సైట్ నందు సూచించిన అప్లికేషన్ ఫాంపై సంబంధిత హెడ్మాస్టర్ సిగ్నేచర్ తో సిద్ధంగా ఉంచుకోవాలి.
✓ అప్లికేషన్ ఫామ్ దిగువన ఇవ్వబడింది డౌన్లోడ్ చేయండి.
✓ ఫోటో, సిగ్నేచర్.. మొదలగునవి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.02.2023 .
అడ్మిట్ కార్డ్/ హాల్టికెట్ల విడుదల :: త్వరలో అందుబాటులోకి వస్తాయి.
రాత పరీక్ష తేదీ :: 29.04.2023 ఉదయం 11:30 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment