TSMS Admission test 2023 | తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Apply Online here..
తెలంగాణ మోడల్ పాఠశాల లో 6 నుండి 10 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల |
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూల్ లో ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త.
తెలంగాణ మోడల్ స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరానికి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూల్ లలో 6 వ తరగతి 7- 10 వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు 10-01-2024 నుండి 08-03-2023 వరకు సమర్పించవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 16-04-2023 నా నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం పోటీపడవచ్చు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక లు నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
అర్హత ప్రమాణాలు:
✓ 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 తరగతి చదువుతున్న విద్యార్థులు (6వ తరగతి ప్రవేశాలకు) అర్హులు.
✓ 7 - 10 తరగతుల్లో ప్రవేశం కోసం, 2023-24 విద్యాసంవత్సరంలో 6 నుండి 9 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చు..
✓ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ పాఠశాలలో ఆరవ తరగతిలో 19,400 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
✓ అలాగే నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను విద్యార్థిని విద్యార్థులు సంతృప్తి పరచాలి.
✓ అధికారిక నోటిఫికేషన్ 6వ తరగతి ప్రవేశం కొరకు.. :: డౌన్లోడ్ చేయండి.
✓ అధికారిక నోటిఫికేషన్ 7 నుండి 10వ తరగతి ప్రవేశం కొరకు.. :: డౌన్లోడ్ చేయండి.
ఎంపిక విధానం :
ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు:
✓ 6వ తరగతి ప్రవేశం కొరకు..
1. తెలుగు నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
2. గణితం నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
3. సైన్స్ & సోషల్(EVS) నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
4. ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు..
ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు
✓ ప్రశ్నాపత్రం 5వ తరగతి సిలబస్ అనుగుణంగా ఉంటుంది.
✓ గణితం & సైన్స్ & సోషల్(EVS) ప్రశ్నపత్రం (తెలుగు & ఇంగ్లిష్) మాధ్యమంలో ఉంటుంది.
✓ 7వ నుండి 10వ తరగతి ప్రవేశం కొరకు..
1. ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
2. గణితం నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
3. జనరల్ సైన్స్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
4. సోషల్ స్టడీస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు..
ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు
✓ ప్రశ్నాపత్రం 5వ తరగతి సిలబస్ అనుగుణంగా ఉంటుంది.
✓ గణితం, జనరల్ సైన్స్ & సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రం (తెలుగు & ఇంగ్లిష్) మాధ్యమంలో ఉంటుంది.
వయోపరిమితి:
✓ 6వ తరగతి ప్రవేశం కోసం 10 సంవత్సరాలు,
✓ 7వ తరగతి ప్రవేశం కోసం 11 సంవత్సరాలు,
✓ 8వ తరగతి ప్రవేశం కోసం 12 సంవత్సరాలు,
✓ 9వ తరగతి ప్రవేశం కోసం 13 సంవత్సరాలు,
✓ 10వ తరగతి ప్రవేశం కోసం 14 సంవత్సరాలు.. పూర్తి చేసుకొని ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ EWS, BC, SC, ST PHC లకు రూ.125/-
✓ జనరల్ విద్యార్థులకు రూ.200/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.02.2023 నుండి 22.02.2023 కు మరల 08.03.2023 వరకు పొడిగించబడింది..
✓ ప్రవేశ పరీక్ష తేదీ, సమయం :16-04-2023.
✓ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకూ..
✓ 7 నుండి 10 తరగతులకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు.
✓ పరీక్ష సెంటర్లు: సంబంధిత జిల్లాల్లోని ముఖ్య పాఠశాలల్లో నిర్వహిస్తారు.
✓ హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : 08-04-2023 నుండి..
అధికారిక వెబ్సైట్ : https://telanganams.cgg.gov.in/
✓ అప్లై చేయుటకు కావలిసినవి:
1. విద్యార్థి ఫోటో,
2. విద్యార్ధి ఆధార్ కార్డ్,
3. విద్యార్థి సంతకం
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment