IIT Kanpur Junior Assistant Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీతో 119 జూనియర్ అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
గ్రాడ్యుయేషన్ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ రెగ్యులర్ ప్రాతిపదికన 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 10 2022 నుండి నవంబర్ 9 2022 మధ్య సమర్పించవచ్చు. రాత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు Pay Level (7th CPC) ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 119.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అవసరం. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
డిసెంబర్ 9 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: ITI తో ప్రభుత్వ శాశ్వత 85 జూనియర్ టెక్నీషియన్ కొలువుల భర్తీకి ప్రకటన..
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ జాబ్ ఓరియెంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
★ రాత పరీక్ష/ జాబ్ ఓరియెంటెడ్ పరీక్షలకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్లో పేర్కొనలేదు. దరఖాస్తు సమర్పించే సమయంలో అభ్యర్థులు పేర్కొన్న ఈమెయిల్ ఐడి లకు తగు సమాచారం ముందుగా అందించబడుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు Pay-Level (7th CPC) Level-3 ప్రకారం రూ.21,700/- నుండి రూ.69100/- వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.700/-.
★ రిజర్వేషన్(ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి మరియు మహిళ) వర్గాలవారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.







అధికారిక వెబ్సైట్ :: https://www.iitk.ac.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సూచనల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సూచనల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.11.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment