Keep India Smiling Foundational Scholarship and Mentorship programme -2022 | 10th, Inter, Degree Apply Online.
Keep India Smiling Foundational Scholarship and Mentorship programme -2022
విద్యార్థులకు శుభవార్త!
కోల్గేట్ పామోలిన్ (ఇండియా) లిమిటెడ్ - ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు డిసెంబర్ 31, 2022 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 5లక్షల రూపాయలకు మించకూడదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ/ తత్సమాన మార్కులు మెమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజురిషీట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఇంటర్ విద్యార్థులకు:
అర్హత ప్రమాణాలు: ప్రస్తుతం విద్యా సంవత్సరంలో(2022-23) ఇంటర్ విద్యను అభ్యసిస్తూ.. పదవ తరగతి లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
రివార్డ్: సంవత్సరానికి రూ.20 వేల చొప్పున 2 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.
డిగ్రీ విద్యార్థులకు:
అర్హత ప్రమాణాలు: ఇంటర్ తత్సమాన పరీక్షలో మొదటి శ్రేణి మార్కులు సాధించి, గుర్తింపు పొందిన కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.
రివార్డ్: సంవత్సరానికి రూ.30 వేల చొప్పున 3 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.
National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..
క్రీడాకారులకు:
అర్హత ప్రమాణాలు: చదరంగం, బాక్సింగ్, అథ్లెటిక్, స్విమ్మింగ్, బాడ్మింటన్, సైక్లింగ్, జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్, పవర్లిఫ్టింగ్, రన్నింగ్.. మొదలగు వ్యక్తిగత క్రీడల్లో ప్రావీణ్యం ఉండి, గడిచిన మూడు సంవత్సరాలలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర/ దేశం తరుపున పైన పేర్కొన్న టువంటి ఏ క్రీడా విభాగంలోనైన ప్రాతినిథ్యం వహించి ఉండాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 100 లోపు ర్యాంకు సాధించి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆగస్టు 31 నాటికి 9 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రముఖ క్రీడా సంస్థ/ ఫెడరేషన్/ అకాడమీ/ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి.
రివార్డ్: సంవత్సరానికి రూ.75 వేల చొప్పున 2 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.
ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నవారికి:
అర్హత ప్రమాణాలు: ఇంటర్/ తత్సమాన పరీక్షలో ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై బీఈ/ బీటెక్/ ఎంబిబిఎస్/ బీడీఎస్ మొదలగు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఏదో ఒకదానిలో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాలి.
రివార్డ్: సంవత్సరానికి రూ.30 వేల చొప్పున 4 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all comitative Exams. Bit Bank.
సమాజసేవలో భాగస్వామ్యం వహిస్తున్న వారికి:
అర్హత ప్రమాణాలు: కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద/ మధ్య తరగతి పిల్లలకు చదువులు చెప్పడం. క్రీడలలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి. అలాగే ప్రస్తుతం 20 నుండి 25 మందికి శిక్షణలు ఇచ్చి ఉండాలి.
రివార్డ్: సంవత్సరానికి రూ.75 వేల చొప్పున 2 సంవత్సరాలు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.







అధికారిక వెబ్సైట్ :: https://www.buddy4study.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment